Modi Lavrov Meeting | ప్రధాని మోదీతో రష్యా విదేశాంగ మంత్రి భేటీ

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Modi Lavrov Meeting | రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi)తో భేటీ అయ్యారు. ఉక్రెయిన్, పశ్చిమ ఆసియాలోని పరిస్థితులతో సహా పరస్పర ఆసక్తి ఉన్న వివిధ ప్రాంతీయ, ప్రపంచ అంశాలపై ఇద్దరూ అభిప్రాయాలను పంచుకున్నారు.

రష్యా విదేశాంగ మంత్రి బుధవారం భారత్​కు వచ్చారు. ఆయనకు కేంద్ర మంత్రి జై శంకర్​ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో గురువారం ఆయన మోదీతో పలు విషయాలపై చర్చించారు. 23వ భారత్-రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశంలో డిసెంబర్ 2025లో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైనప్పటి నుంచి ద్వైపాక్షిక సహకారంలో సాధించిన పురోగతి గురించి లావ్రోవ్ మోదీకి వివరించారని ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. బ్రిక్స్ (BRICS) విదేశాంగ మంత్రుల సమావేశానికి హాజరయ్యేందుకు లావ్రోవ్ వచ్చారు

Modi Lavrov Meeting | ఆనందంగా ఉంది

రష్యా (Russia) విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌కు స్వాగతం పలకడం ఆనందంగా ఉందని ప్రధాని మోదీ తెలిపారు. ఎక్స్​ వేదికగా ఆయన పోస్ట్ చేశారు. మా ప్రత్యేక, విశిష్ట వ్యూహాత్మక భాగస్వామ్యంలోని వివిధ అంశాలలో సాధించిన పురోగతిపై సమాచారం అందించినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేశామని పేర్కొన్నారు.

 

దీనిని కూడా చదవండి : Trump Secret Letter | ట్రంప్ పర్యటన వేళ జేడీ వాన్స్‌కు ‘సీక్రెట్ లెటర్’.. అందులో ఏముంది?

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *