అంతర్జాతీయంMeta Layoffs | 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా..

Meta Layoffs | 8 వేల మంది ఉద్యోగులను తొలగించనున్న మెటా..

ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మే 20న మరో 8 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Meta Layoffs | ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా మే 20న మరో 8 వేల మంది ఉద్యోగులను తొలగించనుంది. ప్రపంచవ్యాప్తంగా తన ఉద్యోగులలో సుమారు 10 శాతం మందిని తొలగిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. తొలగించిన వారికి సెవరెన్స్ ప్యాకేజీలు లభిస్తాయని మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గల్లే పేర్కొన్నారు.

మెటా చీఫ్ పీపుల్ ఆఫీసర్ జానెల్ గేల్ పంపిన ఒక అంతర్గత మెమో ద్వారా కంపెనీ తన ఉద్యోగులకు ఈ తొలగింపుల గురించి తెలియజేసింది. మే 20న కంపెనీలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి దారితీసే అంతర్గత మార్పులపై కంపెనీ పనిచేస్తోందని జానెల్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఏఐ వినియోగం పెరగడంతో అనేక టెక్​ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఏఐపై భారీగా ఇన్వెస్ట్​ చేస్తూ ఇతర ఖర్చులను తగ్గించుకుంటున్నాయి. దీంతో సాఫ్ట్​వేర్​ ఉద్యోగులు (Software Employees) ఆందోళన చెందుతున్నారు. రానున్న రోజుల్లో సాఫ్ట్​వేర్​ రంగంలో సంక్షోభం వచ్చే అవకాశం ఉందని భయపడుతున్నారు.

Meta Layoffs | ఉద్యోగులకు ప్యాకేజీ

తొలగిస్తున్న ఉద్యోగులకు మెటా ప్యాకేజీ (Meta Package) ప్రకటించింది. దీని ప్రకారం అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులకు 16 వారాల మూల వేతనంతో పాటు, ఉద్యోగంలో ఉన్న ప్రతి సంవత్సరానికి రెండు వారాల వేతనం ఇస్తామని తెలిపింది. యూఎస్ ఉద్యోగులు, వారి కుటుంబాల ఆరోగ్య సంరక్షణ ఖర్చులను కూడా 18 నెలల పాటు కంపెనీ భరిస్తుంది. అమెరికా బయట ఉన్న ఉద్యోగులకు ప్యాకేజీలు ఇదే విధంగా ఉంటాయని తెలిపింది. అయితే దేశాన్ని బట్టి, అలాగే స్థానిక కాలపరిమితులు, ప్రక్రియలు మారుతూ ఉంటాయని వివరించింది.

ఇది కూడా చదవండి..: Trump Xi Meeting | జిన్​పింగ్​ గొప్ప స్నేహితుడు : డోనాల్డ్ ట్రంప్​

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

 Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి గొప్ప మనసు.. బాలుడి చికిత్సకు చేయూత

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Komatireddy Helped Boy | మంత్రి కోమటిరెడ్డి...

GHMC MoU | ఐఐటీ ఖరగ్​పూర్​తో జీహెచ్​ఎంసీ ఒప్పందం

అక్షరటుడే, వెబ్​డెస్క్ : GHMC MoU | అత్యంత అధునాతన ఏఐ...

RTC Merger Talks|ఆర్టీసీ విలీనంపై కసరత్తు..కార్మిక సంఘాలతో మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక భేటీ!

అక్షరటుడే వెబ్‌డెస్క్:RTC Merger Talks|తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఇచ్చిన...