జాతీయంSilver Import Restrictions | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వెండి దిగుమతులపై ఆంక్షలు

Silver Import Restrictions | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. వెండి దిగుమతులపై ఆంక్షలు

కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి దిగుమతులపై పలు ఆంక్షలు విధించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Silver Import Restrictions | కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వెండి (Silver) దిగుమతులపై పలు ఆంక్షలు విధించింది. ఈ లోహంలోని పలు వర్గాలను ‘స్వేచ్ఛా’ దిగుమతి విధానం నుంచి ‘నియంత్రిత’ విధానానికి మార్చింది.

ముడి చమురు (Crude Oil) ధరలు పెరుగుతున్న నేపథ్యంలో పొదుపు చర్యలు పాటించాలని ప్రధాని మోదీ (PM Modi) ఇటీవల కోరిన విషయం తెలిసిందే. ఏడాది పాటు బంగారం కొనొద్దని ఆయన కోరారు. ఈ మేరకు బంగారం, వెండిపై దిగుమతి సుంకాన్ని ఇటీవల 15శాతానికి కేంద్ర పెంచింది. తాజాగా వెండి దిగుమతులపై ఆంక్షలు విధించింది. కొత్త నిబంధనల ప్రకారం.. వెండి కడ్డీలు, శుద్ధి చేయని వెండి, పొడి రూపంలో ఉన్న వెండితో సహా పాక్షికంగా తయారైన వెండి రూపాల దిగుమతులకు ఇకపై తప్పనిసరిగా ప్రభుత్వ అనుమతి అవసరం. కొన్ని వర్గాల వెండి దిగుమతులను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనలకు కూడా లోబడి ఉండేలా చేశారు.

Silver Import Restrictions | విదేశీమారక ద్రవ్యం కాపాడుకోవడానికి..

ముడి చమురు ధరలు పెరగడంతో భారత ఫారెక్స్​ నిల్వలు కరిగి పోతున్నాయి. విదేశీ మారకద్రవ్యం మొత్తం చమురు కొనుగోళ్లకు కేటాయించాల్సిన పరిస్థితి ఉంది. బంగారం, వెండి దిగుమతులకు సైతం భారీగా ఫారెక్స్​ నిల్వలు అవసరం అవుతున్నాయి. ఈ క్రమంలో అత్యవసరం కాని వీటి కొనుగోలు, దిగుమతుల విషయంలో ఆంక్షలు విధించడంతో విదేశీ మారకద్రవ్యం కాపాడుకోవచ్చని కేంద్రం భావిస్తోంది. కాగా ఇప్పటికే దిగుమతి సుంకం పెంపుతో వెండి ధరలు భారీగా పెరిగాయి. తాజాగా ఆంక్షలు విధించడంతో రేట్లు ఇంకా పెరిగే అవకాశం ఉంది. దీంతో ఆభరణాల తయారీదారులు, ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

దీనిని కూడా చదవండి : Rupee Value Fall | క్రూడ్ ఆయిల్ కుతకుత.. రూపాయి విలవిల

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Chola Copper Plates | 14 ఏళ్ల నిరీక్షణకు తెర.. స్వదేశానికి ‘చోళుల కాలం నాటి రాగి శాసనాలు’!

Chola Copper Plates | భారతీయ సాంస్కృతిక వారసత్వ పునరుద్ధరణలో మరో...

Saraswati Antya Pushkaralu | ఈనెల 21 నుంచి సరస్వతీ నదీ అంత్య పుష్కరాలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Saraswati Antya Pushkaralu | కాళేశ్వరంలో ఈనెల 21...

Southwest Monsoon Kerala | ఈ నెల 26న కేరళ తీరానికి నైరుతి రుతుపవనాలు..మరో నాలుగైదు రోజుల్లో తెలంగాణలోకి ప్రవేశం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Southwest Monsoon Kerala | ఎండలతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు...

Nizamabad Ganja Seizure | నగరంలో భారీగా గంజాయి పట్టివేత

అక్షరటుడే, నిజామాబాద్​ క్రైం: Nizamabad Ganja Seizure | నగరంలోని రైల్వేస్టేషన్​లో...