AP municipal election counting | ఏపీ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్‌కు సర్వం సిద్ధం.. నేడు ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు!

బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన తీర్పును వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: AP municipal election counting | ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న మున్సిపల్ ఎన్నికల ఫలితాల ప్రక్రియకు రంగం సిద్ధమైంది. రాష్ట్రవ్యాప్తంగా జరిగిన మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్ల ఎన్నికల ఓట్ల లెక్కింపునకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) సర్వం సిద్ధం చేసింది.

మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండటంతో అభ్యర్థుల భవితవ్యం మరికొన్ని గంటల్లో తేలనుంది. బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తమైన తీర్పును వెల్లడించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.

AP municipal election counting | 138 కౌంటింగ్ కేంద్రాలు..

కౌంటింగ్ ప్రక్రియకు భారీ ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 138 కౌంటింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 92 మున్సిపాలిటీలు, 13 కార్పొరేషన్లకు సంబంధించి ఈ ఓట్ల లెక్కింపు కొనసాగనుంది. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పారదర్శకంగా కౌంటింగ్ జరిగేందుకు మొత్తం 47,817 మంది సిబ్బందిని నియమించారు.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

AP municipal election counting | 62.16 శాతం ఓటింగ్ నమోదు..

ఇటీవలే ముగిసిన పోలింగ్‌లో రాష్ట్రవ్యాప్తంగా సగటున 62.16 శాతం ఓటింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి పట్టణ ప్రాంతాల్లో ప్రధాన రాజకీయ పార్టీల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నట్లు స్పష్టమవుతోంది. ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కాగానే మొదటి రౌండ్ ఫలితాల ట్రెండ్స్ వెలువడే అవకాశం ఉంది. కౌంటింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *