Bigg Boss Telugu 10 | బిగ్ బాస్ ఎలిమినేషన్‌ను అంగీకరించిన కృష్ణుడు.. పర్ఫెక్ట్ ప్లేయర్ ఆయనేనంటూ ప్రశంసలు

బిగ్ బాస్ తెలుగు 10 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్ లైవ్ ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bigg Boss Telugu 10 | బిగ్ బాస్  ( Bigg Boss ) తెలుగు 10 హౌస్ నుంచి ఎలిమినేట్ అయిన నటుడు కృష్ణుడు జియోహాట్‌స్టార్ లైవ్ ఇంటరాక్షన్‌లో తన అనుభవాలను పంచుకున్నారు. ఓటింగ్ తీరును గానీ, తోటి కంటెస్టెంట్లను గానీ తప్పుపట్టకుండా.. ప్రేక్షకుల తీర్పును ఆయన హుందాగా అంగీకరించారు. తాను ఎలిమినేట్ కావడానికి తనే అర్హుడినని నిష్కపటంగా ఒప్పుకున్న కృష్ణుడు, బిగ్ బాస్ ప్రయాణం తన జీవితంలో మరువలేని అనుభూతినని తెలిపారు. ఇక హౌస్‌లో తరచూ తింటూ, నిద్రపోతున్నారనే విమర్శలపై స్పందిస్తూ.. అక్కడ ఆహార పరిమితులు ఉంటాయని, సరైన అల్పాహారం కూడా దొరకదని క్లారిటీ ఇచ్చారు.

Bigg Boss Telugu 10 | రోహిత్‌తో ప్రత్యేక బంధం..

హౌస్‌లో రోహిత్‌తో ఏర్పడిన అనుబంధం గురించి కృష్ణుడు మాట్లాడుతూ.. మొదట్లో ఇద్దరి మధ్య చిన్నపాటి అభిప్రాయ భేదాలు ఉన్నా, ఆ తర్వాత మంచి స్నేహితులమయ్యామని చెప్పారు. ఎలిమినేషన్ సమయంలో రోహిత్ కంటతడి పెట్టుకోవడం తనను కదిలించిందన్నారు. రోహిత్‌ను ఒక బలమైన వ్యూహాత్మక ఆటగాడిగా అభివర్ణించిన ఆయన.. శాలినితో పెరుగుతున్న సాన్నిహిత్యం కారణంగా రోహిత్ ఆటపై ఏకాగ్రత కోల్పోతున్నాడని, ఇది అతని గేమ్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడ్డాడు.

Bigg Boss Telugu 10 | టాప్ 5 కంటెస్టెంట్లు వీరే..

ఈ సీజన్‌లో త్రిగుణ్, రోహిత్‌లు బలమైన పోటీదారులుగా నిలుస్తారని కృష్ణుడు అంచనా వేశారు. ముఖ్యంగా త్రిగుణ్‌ను “పరిపూర్ణ బిగ్ బాస్ ఆటగాడు”గా అభివర్ణించారు. తన అంచనా ప్రకారం త్రిగుణ్, రోహిత్, అమన్, ముఖేష్, ఝాన్సీలు టాప్ 5 జాబితాలో ఉండే అవకాశం ఉందన్నారు. ఇదే సమయంలో సుధీర్ సృష్టితో లవ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించగా, ముఖేష్‌ను సరదాగా “ఉమెన్ ట్రాక్ విన్నర్” అని పేర్కొంటూ కొన్ని ఆసక్తికర చర్చలకు తెరలేపారు.

ఇది కూడా చదవండి:  Sthree Nidhi Electric Autos | మహిళలకు ఎలక్ట్రిక్ ఆటోల పంపిణీ

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *