అక్షరటుడే, వెబ్డెస్క్: Defence Liquor Sale | మాజీ సైనికులు ఆర్మీ క్యాంటిన్లో కొనుగోలు చేసిన మద్యాన్ని వారి భార్యలు అక్రమంగా విక్రయిస్తున్నారు. ఈ మేరకు ఇద్దరు మహిళలను ఎక్సైజ్ అధికారులు (Excise officers) అరెస్ట్ చేశారు.
అల్వాల్లో ఎక్సైజ్ అధికారులు రెండు వేర్వేరు ప్రాంతాల్లో దాడులు జరిపారు. రక్షణ శాఖకు చెందిన 163 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. మాజీ సైనికోద్యోగులు తమ క్యాంటీన్ కోటా ద్వారా పొందిన మద్యాన్ని, వారి భార్యలు అనధికారికంగా విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రక్షణ శాఖ క్యాంటీన్ కోటా ద్వారా రాయితీ ధరలకు కొనుగోలు చేసిన మద్యాన్ని, అనుమతి లేని వ్యక్తులకు విక్రయిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న మద్యం విలువ రూ. 2.11 లక్షలు ఉంటుందని అంచనా.
Defence Liquor Sale | లోతుకుంటలో..
లోతుకుంటలోని సరస్వతీ నగర్లో నాగప్రసన్న, ఆమె భర్త రామ్ ఆంజనేయులు రక్షణ శాఖకు చెందిన మద్యాన్ని అక్రమంగా విక్రయిస్తున్నారనే సమాచారం మేరకు అధికారులు దాడులు చేశారు. 96 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. రామ్ ఆంజనేయులు ఈ మద్యం సీసాలను సేకరించగా, ఆయన భార్య నాగప్రసన్న తమ ఇంట్లోనే అమ్ముతున్నట్లు తెలిపారు. మరో ఘటనలో అల్వాల్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని సౌజన్య కాలనీలో ఒక ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. ముసిమి లెంక (39) అనే మహిళ వద్ద నుంచి రక్షణ శాఖకు చెందిన 67 మద్యం సీసాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం ఎక్సైజ్ అధికారులు ఈ కేసులపై విచారణ జరుపుతున్నారు.
ఇది కూడా చదవండి..: Firecrackers Safety | టపాసులు కాలుస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి