Mumbai Indians | ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా మళ్లీ రోహిత్ శర్మ

ముంబై ఇండియన్స్​ కెప్టెన్​గా మళ్లీ రోహిత్​ శర్మ నియమితులయ్యారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Mumbai Indians | ముంబై ఇండియన్స్​ కెప్టెన్​గా మళ్లీ రోహిత్​ శర్మ నియమితులయ్యారు. గత సీజన్​లో కెప్టెన్​గా వ్యవహరించిన హార్దిక్​ పాండ్యా పంజాబ్​ కింగ్స్​ జట్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో ముంబై యాజమాన్యం మరోసారి రోహిత్​ వైపు మొగ్గు చూపింది.

రోహిత్​ శర్మను కెప్టెన్​ చేస్తున్నట్లు ముంబై జట్టు శుక్రవారం సాయంత్రం ప్రకటన విడుదల చేసింది. ఆ జట్టు కెప్టెన్ కావడం అతడికి ఇది రెండోసారి. గతంలో ముంబై జట్టుకు రోహిత్​ శర్మ ఐదు టైటిళ్లు అందించాడు. అయితే కొంతకాలంగా ఫామ్​ కోల్పోవడంతో ముంబై జట్టు గుజరాత్​ కెప్టెన్​గా ఉన్న హార్దిక్​ను 2024లో తీసుకొచ్చి పగ్గాలు అప్పగించింది. రెండు సార్లు పాండ్యా సారథ్యంలో ముంబై తలపడింది.

Mumbai Indians | మూడేళ్ల విరామం

శర్మ ఐపీఎల్ 2013 నుంచి 2023 వరకు ముంబై జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఆ తర్వాత ఐపీఎల్ 2024లో పాండ్యా కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టారు. తాజాగా 2027లో మరోసారి శర్మ సారథ్యంలో ముంబై జట్టు ఆడనుంది. రాబోయే ఐపీఎల్ సీజన్‌కు ముందు, అర్ష్‌దీప్ సింగ్‌తో కూడిన ప్లేయర్-స్వాప్ డీల్‌లో ఎంఐ, హార్దిక్‌ను పంజాబ్ కింగ్స్‌కు ట్రేడ్ చేసింది. అలాగే ముంబైకి కీరన్ పొలార్డ్ హెడ్ కోచ్‌గా, రాబిన్ ఉతప్ప బ్యాటింగ్ కోచ్‌గా నియమితులయ్యారు.

దీనిని కూడా చదవండి : Delimitation Bill | డీలిమిటేషన్ బిల్లుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *