Oct 24 Horoscope | బంధువుల సహకారంతో వ్యాపారంలో భారీ లాభాలు.. మారనున్న ఈ రాశుల వారి అదృష్టం..!

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Oct 24 Horoscope | గ్రహాల సంచారం, నక్షత్రాల స్థితిగతుల ప్రభావం వల్ల నేడు (శనివారం, అక్టోబరు 24) పలు రాశుల వారి జీవితాల్లో విభిన్నమైన పరిస్థితులు ఎదురవుతాయి. ముఖ్యంగా ఉద్యోగ, వ్యాపార రంగాలతో పాటు ఆర్థిక స్థితిగతులు, కుటుంబ బంధాలు, ఆరోగ్యపరమైన అంశాలలో ఈరోజు అందరికీ మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరి నేడు ఏ రాశి వారికి ఎలాంటి అదృష్టం వరించింది? ఏ రాశివారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం..

Oct 24 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Oct 24 Horoscope | ఇంటి పెద్దల నుంచి ధనాన్ని దాచే , ఖర్చు చేసే విధానంపై మంచి సలహాలు అందుకుంటారు. సాయంత్రం వేళ ఊహించని అతిథుల రాకతో ఇల్లు ఉత్సాహంగా మారుతుంది. జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. ఒక వివాహ వేడుకకు హాజరయ్యే అవకాశం ఉంది.

వృషభ రాశి: Oct 24 Horoscope | అనవసరమైన భయాలు , ఆలోచనలను మనసులోకి రానీయకుండా ఉత్సాహంగా ఉండండి. బంధువుల సహాయసహకారాలతో వ్యాపారంలో మంచి ఆర్థిక లాభాలు అందుకుంటారు. ఇంటిని అందంగా తీర్చిదిద్దే పనులపై దృష్టి పెడతారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుని పెండింగ్ పనులన్నీ పూర్తి చేయండి. ఆరోగ్యం కోసం హనుమాన్ చాలీసా పఠించండి.

Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్‌ దిశగా మరో అడుగు..

మిథున రాశి: Oct 24 Horoscope | మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది, లేకుంటే మీ మాటలు ఇతరులను బాధించవచ్చు. ఆర్థికంగా మంచి లాభాలను తెచ్చే కొత్త అవకాశాలు ఎదురవుతాయి అలాగే బంధువులు, స్నేహితుల నుంచి అనూహ్య బహుమతులు అందుతాయి.

కర్కాటక రాశి: Oct 24 Horoscope | మీరు అదనపు ధనం సంపాదించాలనుకుంటే సురక్షితమైన ఆర్థిక పథకాలలో పెట్టుబడి పెట్టండి. కుటుంబ సభ్యులతో , స్నేహితులతో ఆనందంగా సమయం గడుపుతారు. ప్రేమ జీవితం ఎంతో అద్భుతంగా సాగుతుంది. అనూహ్యమైన రీతిలో ముఖ్యమైన ఆహ్వానాలు అందుకుంటారు.

సింహ రాశి: Oct 24 Horoscope | ఇతరులకు ఎవరూ ఆర్థిక సాయం చేయకపోయినా, మీరు మాత్రం వారి అవసరాల కోసం ముందుకు వచ్చి అప్పు ఇస్తారు. కుటుంబంలోని చిన్నవారితో కలిసి ఆనందంగా సమయం గడపడం ద్వారా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. కుటుంబ జీవితంలో ఆనందం వెల్లివిరియడానికి ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం 11 సార్లు “ఓం గం గణపతయే నమః” పఠించండి.

కన్యా రాశి: Oct 24 Horoscope | మీ అభిమాన కల నెరవేరే శుభ సమయం ఇది. కార్యక్రమంలో కలిసే వ్యక్తి ఇచ్చే సలహా మీ ఆర్థిక పరిస్థితిని మరింత బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. స్నేహితులు మీకు పూర్తి అండగా నిలిచినప్పటికీ సంభాషించేటప్పుడు మాట జాగ్రత్తగా ఉండాలి.మీలోని సృజనాత్మకత, కొత్త విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తి మీకు లాభదాయకమైన ఫలితాలను అందిస్తాయి.

తులా రాశి: Oct 24 Horoscope | సామాజిక వేడుకలకు హాజరుకావడం ద్వారా ప్రముఖ వ్యక్తుల పరిచయం లభిస్తుంది. పాత స్నేహితులను కలుసుకోవడానికి , మీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ఇది చక్కటి అవకాశం.

వృశ్చిక రాశి: ఆరోగ్యం బాగుంటుంది. చిన్నతరహా వ్యాపారాలు చేసేవారికి సన్నిహితుల సలహాలు మంచి ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి, అలాగే అవసరమైన సమయానికి స్నేహితులు ఆదుకుంటారు. చాలాకాలం తర్వాత ఇవాళ ఎంతో ప్రశాంతంగా, ఉత్సాహంగా కనిపిస్తారు.

ధనుస్సు రాశి: కుటుంబ సభ్యుల ప్రవర్తన కొన్నిసార్లు చిరాకు కలిగించినప్పటికీ, సహనంతో ఉండటం చాలా ముఖ్యం. గతంలో చేసిన పెట్టుబడుల నుంచి అనుకోకుండా మంచి లాభాలు అందుకుంటారు. కొత్త ఇంటికి మారడం లేదా ఇంటి మార్పులు చేసుకోవడం మీకు శుభఫలితాలను ఇస్తుంది. అనుకోకుండా వచ్చే ఒక వార్త మీకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది. ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కాస్త ఎక్కువ శ్రమపడటం వల్ల అనుకున్న ఫలితాలు సాధించగలరు.

మకర రాశి: మీరు ఎప్పటినుంచో అనుకుంటున్న ధన పొదుపు ఆలోచన ఇవాళ విజయవంతంగా ఆచరణలోకి వస్తుంది. అయితే మీ మంచి తనాన్ని ఇతరులు అలుసుగా తీసుకునే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి. జీవిత భాగస్వామితో చిన్నపాటి వాదనలు జరిగే అవకాశం ఉంది.

కుంభ రాశి: మనసులోని భయాలను తొలగించుకుని సానుకూల దృక్పథంతో ముందుకు సాగండి. గతంలో చేసిన పెట్టుబడులు మంచి లాభాలను అందించడంతో వాటి ప్రాముఖ్యతను ఇవాళ పూర్తిగా గ్రహిస్తారు. వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా సాగిపోతుంది.

మీన రాశి: తల్లిదండ్రుల సహకారం లభించడంతో ఆర్థిక సమస్యలు తొలగిపోయి ఎంతో ఊరట లభిస్తుంది. వ్యక్తిగత జీవితంలో జరిగే సానుకూల పరిణామాలు మీ కుటుంబంలో సంతోషాన్ని నింపుతాయి. బంధువుల వల్ల జీవిత భాగస్వామితో చిన్నపాటి మనస్పర్థలు రావచ్చు.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *