Rajnath Singh | ఉగ్రవాదంపై రక్షణ మంత్రి కీలక వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rajnath Singh | రక్షణ శాఖ మంత్రి రాజ్​నాథ్​ సింగ్​ ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు. జాతీయ భద్రతా సదస్సు 2.0లో ఆయన గురువారం మాట్లాడారు. ఉగ్రవాదం ఉన్నంత కాలం సమష్టి శాంతి, అభివృద్ధి శ్రేయస్సుకు సవాలుగా నిలుస్తూనే ఉంటుందన్నారు.

ఉగ్రవాదాన్ని మతపరమైన పదజాలంతో కప్పిపుచ్చి లేదా హింసాత్మక భావజాలంతో ముడిపెట్టి సమర్థించే ప్రయత్నాలు జరుగుతాయని రాజ్​నాథ్​ ఆరోపించారు. ఇది అత్యంత ప్రమాదకరమని, అత్యంత హానికరమైనదన్నారు. ఇది ఉగ్రవాదులకు రక్షణ కవచంలా ఉండి, వారి లక్ష్యాల వైపు నెమ్మదిగా పురోగమించడానికి అవకాశం కల్పించడంతో సమానమని తెలిపారు.

Rajnath Singh | పహల్గామ్​ ఉగ్రదాడి తర్వాత..

ఆపరేషన్ సింధూర్ (Operation Sindoor) అనేది ఉగ్రవాద నిరోధానికి ప్రత్యేక నిదర్శనం అన్నారు. శాంతి, స్థిరత్వానికి శక్తిమంతమైన నిరోధక శక్తి చాలా అవసరమని పేర్కొన్నారు. పహల్గామ్ (Pahalgam) ఘటన తర్వాత ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తాము సర్జికల్ స్ట్రైక్స్ (Surgical Strikes), వైమానిక దాడులు, ఆపరేషన్ సిందూర్ చేపట్టామని వివరించారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా తమ వైఖరికి ఇది నిదర్శనం అని చెప్పారు. ఉగ్రవాదం ఒక వికృత మనస్తత్వం, మానవత్వానికి ఒక మచ్చగా రక్షణ మంత్రి అభివర్ణించారు.

Rajnath Singh | అందుకే ముగించాం

ఆపరేషన్ సిందూర్ సాయుధ దళాల సమైక్యతకు ఒక ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. సైన్యం, నౌకాదళం, వైమానిక దళం కలిసికట్టుగా, ఒకే ప్రణాళికతో పనిచేయడం ద్వారా, భారతదేశ సైనిక శక్తి ఇకపై విడివిడిగా పనిచేయదని, ఒక ఉమ్మడి, సమీకృత మరియు ప్రపంచ శక్తిగా ఆవిర్భవించిందని నిరూపించాయన్నారు. ఆపరేషన్​ సిందూర్​ను స్వచ్ఛందంగా సొంత షరతులపై నిలిపివేశామని చెప్పారు. , అవసరమైతే, సుదీర్ఘ యుద్ధానికి తాము పూర్తిగా సిద్ధంగా ఉన్నామని, అంతేకాకుండా, ఆకస్మిక అవసరాల సమయంలో సామర్థ్యాలను విస్తరించే శక్తి, అంటే సర్జ్ కెపాసిటీ కూడా ఉందన్నారు.

ఇది కూడా చదవండి..: Madhya Pradesh Accident | మధ్యప్రదేశ్​లో ఘోర ప్రమాదం.. 16 మంది మృతి

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *