అక్షరటుడే, వెబ్‌డెస్క్: US Flight Resumption | అమెరికాలో విమాన ప్రయాణాలను అధికారులు పునరుద్ధరించారు. టెలికాం అంతరాయం కారణంగా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే. ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక లోపం వల్ల ఎఫ్ఏఏ దేశవ్యాప్త గ్రౌండ్ స్టాప్‌ను విధించింది.
అమెరికా (America) వ్యప్తంగా సుమారు 7 వేల విమానాలు రద్దు లేదా ఆలస్యమయ్యాయి. పాత అనలాగ్ సిస్టమ్స్ ఓవర్ లోడ్ అవ్వడమే కారణమని రవాణా శాఖ వెల్లడించింది. ప్రయాణికులను చిక్కులో పడేసిన ‘గ్రౌండ్ స్టాప్’ను అధికారులు ఎత్తివేశారు. దీంతో నాలుగు గంటల విరామం తర్వాత విమాన ప్రయాణాలు ప్రారంభం అయ్యాయి.
US Flight Resumption | ఓవర్ లోడ్ కారణంగా..
డేటా ఓవర్‌లోడ్ కారణంగా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కమ్యూనికేషన్లు, రాడార్ దెబ్బతిన్నాయి. దీంతో అమెరికా కాలమానం ప్రకారం శుక్రవారం రాత్రి విమాన సర్వీసులను నిలిపివేశారు. అనంతరం సమస్యను పరిష్కరించి రాకపోకలను పునరుద్ధరించారు. కాగా విమానాలు నిలిచిపోవడంతో లక్షలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. తాత్కాలిక టెలికమ్యూనికేషన్ల అంతరాయం కారణంగానే ఈ అంతరాయం ఏర్పడిందని FAA పేర్కొంది. ఈ అంతరాయం సైబర్‌దాడి, కృత్రిమ మేధ సంఘటన వల్ల గానీ సంభవించిందని “సూచించే ఆధారాలు ఏమీ లేవు” అని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి..: US Flight Ground Stop | అమెరికాలో విమాన సర్వీసులు బంద్.. FAA అత్యవసర ఉత్తర్వులు!