అక్షరటుడే, వెబ్‌డెస్క్: Vijay Convoy Disappears | తమిళనాడు రాజకీయాల్లో సంచలనం సృష్టించిన విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం (Tamizhaga Vetri Kazhagam) పార్టీ ఎన్నికల ఫలితాల్లో భారీ ప్రభావం చూపించినప్పటికీ.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో నెలకొన్న అనిశ్చితి ఇప్పుడు కొత్త రాజకీయ చర్చలకు దారితీస్తోంది.
ఫలితాలు వెలువడిన నాటి నుంచి పోలీసు భద్రత, భారీ కాన్వాయ్ మధ్య తిరిగిన విజయ్ (Vijay).. బుధవారం రాత్రికి పూర్తిగా భిన్నంగా కనిపించడం హాట్ టాపిక్‌గా మారింది. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే టీవీకే కార్యాలయం వద్ద భారీ హడావుడి నెలకొంది. విజయ్ సీఎం అవుతారన్న ప్రచారం జోరందుకోవడంతో పోలీసులు కూడా ప్రత్యేక భద్రత కల్పించారు. ఆయన ఎక్కడికి వెళ్లినా పోలీసు కాన్వాయ్ (Police Convoy) వెంట ఉండేది. పార్టీ శ్రేణులు, అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో ఆయన చుట్టూ గుమిగూడేవారు.
Vijay Convoy Disappears | ప్రభుత్వ ఏర్పాటుపై సందిగ్ధతే కారణమా?
అయితే బుధవారం రాత్రి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. రాత్రి ఆలస్యంగా పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరిన విజయ్.. తన సొంత కారులో ఇంటికి వెళ్లారు. ఆయన వెనుక వ్యక్తిగత భద్రతా సిబ్బంది ఉన్న మరో వాహనం మాత్రమే కనిపించింది. గత రెండు రోజులుగా కనిపించిన భారీ పోలీసు ఎస్కార్ట్, కాన్వాయ్, భద్రతా సిబ్బంది హడావుడి ఎక్కడా కనిపించలేదు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం.. ప్రభుత్వ ఏర్పాటు విషయంలో ఇంకా స్పష్టత రాకపోవడమే ఈ మార్పుకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. అసెంబ్లీలో మెజారిటీ సమీకరణలు క్లిష్టంగా మారడంతో టీవీకే TVKపరిస్థితి ఏ దిశగా వెళ్తుందన్నది ఇంకా తేలలేదు. కొంతమంది ఎమ్మెల్యేల మద్దతుపై జరుగుతున్న చర్చలు కూడా అనిశ్చితిని పెంచుతున్నట్లు సమాచారం.
Vijay Convoy Disappears | టీవీకే భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటి?
మొన్నటి వరకు విజయ్ ప్రభుత్వ ఏర్పాటు చేయబోతున్నారన్న ప్రచారం బలంగా వినిపించింది. కానీ రాజకీయ సమీకరణాలు మారిపోవడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లలో కూడా మార్పులు చోటుచేసుకున్నాయని భావిస్తున్నారు. బుధవారం రాత్రి పార్టీ కార్యాలయం నుంచి బయలు దేరిన సమయంలో విజయ్ చాలా ముభావంగా కనిపించినట్లు అక్కడున్నవారు చెబుతున్నారు. సాధారణంగా అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేసే ఆయన.. ఈసారి మాత్రం నిశ్శబ్దంగా కారులో వెళ్లిపోయారు. ఇది చూసిన అభిమానుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. టీవీకే భవిష్యత్ రాజకీయ వ్యూహం ఏమిటి? ప్రభుత్వం ఏర్పాటులో పార్టీ పాత్ర ఎలా ఉండబోతోంది? అనే అంశాలపై ఆసక్తి నెలకొంది.
ఇది కూడా చదవండి..: West Bengal Political Violence | పశ్చిమ బెంగాల్‌లో మళ్లీ నెత్తురోడిన రాజకీయం.. బీజేపీ నేత సువేందు పీఏ దారుణ హత్య

