జాతీయంLIC New Jeevan Saathi | ఒకే ప్లాన్‌తో భార్యాభర్తలిద్దరికీ బీమా.. న్యూ జీవన్ సాతి...

LIC New Jeevan Saathi | ఒకే ప్లాన్‌తో భార్యాభర్తలిద్దరికీ బీమా.. న్యూ జీవన్ సాతి పేరుతో లాంచ్ చేసిన ఎల్ఐసీ

ఎల్ఐసీ రెండు సరికొత్త జాయింట్ లైఫ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లను తీసుకువచ్చింది. ఒకే ప్లాన్‌తో భార్యాభర్తలిద్దరికీ బీమా సౌకర్యం కల్పించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: LIC New Jeevan Saathi | దేశీయ బీమా రంగ దిగ్గజ సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (Life Insurance Corporation of India) రెండు సరికొత్త ప్లాన్ లతో వచ్చింది. ఒకే పాలసీతో భార్యాభర్తలిద్దరికీ జీవిత బీమా రక్షణతో పాటు పొదుపు అందించేలా ఈ కొత్త పాలసీలను రూపొందించారు. ‘ఎలఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం’, ‘ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం’ పేర్లతో తీసుకువచ్చిన ఈ ప్లాన్‌ల వివరాలు తెలుసుకుందామా..

LIC New Jeevan Saathi | ప్లాన్‌ల ప్రత్యేకత..

ఎల్ఐసీ తీసుకువచ్చిన ఈ రెండు కొత్త ప్లాన్‌లు నాన్ పార్టిసిపేట్, నాన్ మార్కెట్ లింక్డ్, గ్యారంటీడ్ అడిషన్స్, ఫిక్స్‌డ్ బెనిఫిట్స్ కలిగి ఉంటాయి. అంటే మార్కెట్ హెచ్చుతగ్గులతో సంబంధం లేకుండా, పాలసీ తీసుకునేటప్పుడే మీ చేతికి ఎంత లాభం వస్తుందో ముందే ఖచ్చితంగా తెలిసిపోతుంది. గ్యారంటీడ్ అడిషన్స్ రూపంలో స్థిరమైన ప్రయోజనాలు అందుతాయి. ముందే నిర్ణయించిన మెచ్యూరిటీ మొత్తాన్ని ఈ ప్లాన్‌లు ఆఫర్ చేస్తున్నాయి.

LIC New Jeevan Saathi | రెండు ఆప్షన్లు..

తమ ఆర్థిక వెసులుబాటును బట్టి రెండు రకాల ప్లాన్‌లలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు. ఎలఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే సరిపోతుంది. పాలసీ కాలపరిమితి ముగిసే వరకు భార్యాభర్తలిద్దరికీ పూర్తి లైఫ్ కవర్ ఉంటుంది. ఒకేసారి పెద్ద మొత్తంలో ప్రీమియం చెల్లించలేని వారి కోసం లిమిటెడ్ ప్రీమియం ప్లాన్ (Limited Premium Plan) సైతం అందుబాటులో ఉంది. పాలసీ కాలపరిమితి కంటే తక్కువ కాలం పాటు ప్రీమియంలు చెల్లించే సౌలభ్యం కూడా ఉంది. ఒకే పాలసీ కింద భార్యాభర్తలిద్దరికీ సమానమైన భద్రత లభిస్తుంది. కాలపరిమితి ముగిశాక వచ్చే లాభాలపై 100 శాతం గ్యారంటీ ఉంటుంది. ఏదైనా ప్రమాదం లేదా మరణం సంభవిస్తే.. కుటుంబానికి ఆర్థిక అండగా నిలిచే డెత్ బెనిఫిట్‌ను తమ అవసరాలకు అనుగుణంగా పొందేందుకు వివిధ ఆప్షన్లున్నాయి.

LIC New Jeevan Saathi | ‘సింగిల్ ’ ప్లాన్ ఫీచర్లు..

ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ సింగిల్ ప్రీమియం ప్లాన్‌లో ప్రతి రూ.1,000 సమ్ అష్యూర్డ్ కు రూ.70 చొప్పున గ్యారంటీ అడిషన్స్ ఉంటాయి. డెత్ బెనిఫిట్ ఆప్షన్స్, పాలసీ టర్మ్‌లో ఏది కావాలో ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. మెచ్యూరిటీ, డెత్ బెనిఫిట్స్ ఇన్‌స్టాల్‌మెంట్లుగా పొందడానికి అవకాశం ఉంటుంది. హై సమ్ అష్యూర్డ్ రిబేట్ కూడా ఉంటుంది. ప్రస్తుతం ఉన్న పాలసీదారు, నామినీకి ఈ రిబేట్ వర్తిస్తుంది. ఈ పాలసీపై లోన్ సౌకర్యం సైతం లభిస్తుంది.

LIC New Jeevan Saathi | ‘లిమిటెడ్ ’ ప్లాన్ ఫీచర్లు..

ఎల్ఐసీ న్యూ జీవన్ సాథీ లిమిటెడ్ ప్రీమియం పేమెంట్ చేసే టర్మ్‌లో పాలసీదారు మరణిస్తే.. తదుపరి ప్రీమియం కట్టాల్సిన అవసరం లేదు. 7 శాతం రేటుతో గ్యారంటీ అడిషన్స్ ఉంటాయి. రెండు డెత్ బెనిఫిట్స్ ఆప్షన్స్ నుంచి కావాల్సిన రిస్క్ కవరేజీని ఎంచుకోవచ్చు. ప్రీమియం పేమెంట్ టర్మ్, పాలసీ టర్మ్ ఎంచుకోవచ్చు. మెచ్యూరిటీ లేదా డెత్ బెనిఫిట్స్ విడతల వారీగా పొందడానికి అవకాశం ఉంటుంది. హై బేసిక్ సమ్ అష్యూర్డ్ పై ఆకర్షణీయమైన ఇన్సెంటివ్స్ ఉంటాయి. ప్రస్తుతం ఉన్న పాలసీదారు, నామినీ, మరణించిన పాలసీదారు బెనిఫీషియరీలకు రిబేట్ వర్తిస్తుంది.

ఇది కూడా చదవండి..: CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్​జీ ధరలు

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Grain procurement issues | అన్నదాత ఆక్రోషం.. రోడ్డుపై ధాన్యం బస్తాలు తగలబెట్టి నిరసన

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Grain procurement issues | మండలంలోని(Yellareddy) హాజీపూర్ తండాలో...

Thailand Drug Dealer Arrest | లేడీ డ్యాన్సర్ల వేషంలో.. డ్రగ్స్​ డాన్​ను పట్టుకున్న పోలీసులు

అక్షరటుడే, వెబ్​డెస్క్: Thailand Drug Dealer Arrest | థాయ్‌లాండ్‌ (Thailand)లో...

Ananya Panday Dance Trolls | అనన్య పాండే డ్యాన్స్​పై ట్రోల్స్..

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ananya Panday Dance Trolls | సినీ నటి...

Stock Market Flat | ఫ్లాట్ గా స్టాక్ మార్కెట్

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Stock Market Flat | అమెరికా (America) ఓవైపు...