CNG Price Hike | మళ్లీ పెరిగిన సీఎన్​జీ ధరలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: CNG Price Hike | ఇంధన ధరల పెరుగుదల ఆగడం లేదు. పెట్రోల్​, డీజిల్​తో పాటు సీఎన్​జీ ధరలు భారీగా పెరుగుతున్నాయి. 15 రోజుల వ్యవధిలో నాలుగు సార్లు పెట్రోల్​, డీజిల్​ ధరలను పెంచిన చమురు సంస్థలు తాజాగా సీఎన్​జీ ధరలను సైతం పెంచారు.

పశ్చిమ ఆసియాలో నెలకొన్న సంఘర్షణల నేపథ్యంలో సీఎన్​జీ ధరలను కిలోకు రూ.రెండు చొప్పున పెంచాయి. ఈ పెంపు మంగళవారం ఉదయం నుంచి అమలులోకి వచ్చింది. 11 రోజుల వ్యవధిలో సీఎన్​జీ ధరలు (CNG Prices) నాలుగో సారి పెరగడం గమనార్హం. ఢిల్లీ (Delhi)లో CNG ధర ఇప్పుడు కిలోగ్రాముకు రూ.83.09కి చేరింది.

CNG Price Hike

CNG Price Hike | రూ.6 పెరుగుదల

మొత్తం నాలుగు విడతలుగా CNG ధరలు కిలోకు రూ.6 మేర పెరిగినట్లయింది. మే 15న రూ.2 పెంచిన కంపెనీలు, మే 17, మే 23 తేదీలలో రెండు విడతలుగా, ఒక్కోసారి రూ.1 చొప్పున ధరలు పెంచాయి. తాజాగా రూ.రెండు పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వాహనదారులపై తీవ్ర ప్రభావం పడుతుంది. రానున్న రోజుల్లో ఇంకా ధరలు పెరిగే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ధరలు ఇలాగే పెరిగితే ద్రవ్యోల్బణం పెరిగి ప్రజలపై తీవ్ర ప్రభావం పడనుంది.

ఇది కూడా చదవండి..: Krishna River Barrage | కృష్ణానదిపై తెలంగాణ-కర్ణాటక సంయుక్త ప్రాజెక్టు.. కొత్త బ్యారేజీ, వంతెన నిర్మాణానికి కీలక అడుగులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *