అక్షరటుడే, వెబ్‌డెస్క్: Twisha Sharma Case | దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన మాజీ నటి, మోడల్ ట్విషా శర్మ వివాదాస్పద మృతి కేసు దర్యాప్తును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) అధికారికంగా ప్రారంభించింది.
Twisha Sharma Case | కీలక పత్రాలు స్వాధీనం
సుప్రీంకోర్టు ఆదేశాలు, మధ్యప్రదేశ్ ప్రభుత్వ సిఫార్సుల మేరకు రంగంలోకి దిగిన సీబీఐ ప్రత్యేక క్రైమ్ యూనిట్, భోపాల్ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) నుంచి కేసు డైరీతో పాటు ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ సాక్ష్యాధారాలు, ఇతర కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంది.
గతేడాది డిసెంబరులో సమర్థ్ సింగ్‌తో వివాహం జరిగిన కేవలం ఐదు నెలలకే, మే 12న భోపాల్‌లోని కటారా హిల్స్ పరిధిలో ఉన్న తన అత్తవారింట్లో ట్విషా శర్మ(33) అనుమానాస్పద స్థితిలో మరణించింది.
Twisha Sharma Case | తీవ్ర వేధింపులు
ప్రాథమిక నివేదికల ప్రకారం.. ఇది ఆత్మహత్యగా భావించినప్పటికీ, ఆమె కుటుంబ సభ్యులు మాత్రం ఇది వరకట్న వేధింపుల హత్య అని, సాక్ష్యాధారాలను తారుమారు చేశారని ఆరోపించారు.
ట్విషా శర్మ అత్త, రిటైర్డ్ డిస్ట్రిక్ట్ జడ్జి గిరిబాల సింగ్ ప్రభావంతో స్థానిక పోలీసులు దర్యాప్తును పక్కదారి పట్టించారని బాధితురాలి కుటుంబం ఆందోళన వ్యక్తం చేసింది.
వివాహం ముగిసిన తర్వాత ‘విదాయి’ (అత్తవారింటికి పంపే సమయం) సమయంలోనే నిందితులు రూ. 2 లక్షలు డిమాండ్ చేశారని, పెళ్లయినప్పటి నుంచి శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేశారని సీబీఐ నమోదు చేసిన సరికొత్త ఎఫ్‌ఐఆర్ (FIR) లో పేర్కొన్నారు. ఈ కేసులో ట్విషా భర్త సమర్థ్ సింగ్, అత్త గిరిబాల సింగ్‌లను ప్రధాన నిందితులుగా చేర్చారు.

Twisha Sharma Case | సీబీఐ ముమ్మర దర్యాప్తు
కేసును చేతుల్లోకి తీసుకున్న వెంటనే ఐదుగురు సభ్యులతో కూడిన సీబీఐ ప్రత్యేక బృందం భోపాల్ చేరుకుంది. భారతీయ న్యాయ సంహిత (BNS), వరకట్న నిషేధ చట్టంలోని పలు కఠినమైన సెక్షన్ల కింద కొత్తగా రెగ్యులర్ కేసు నమోదు చేసింది.
సీబీఐ అధికారులు మంగళవారం ఉదయం ట్విషా శర్మ అత్తగారింటికి వెళ్లి క్రైమ్ సీన్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటన జరిగిన తీరును, గది అమరికలను పునర్నిర్మించి (Recreate) సాక్ష్యాలను సేకరించారు.
మరోవైపు భోపాల్‌లోని మిలిటరీ గెస్ట్ హౌస్‌లో ట్విషా శర్మ కుటుంబ సభ్యులను కలిసి వారి స్టేట్‌మెంట్‌లను రికార్డు చేశారు. గతంలో స్థానిక ఎస్‌ఐటీ (SIT) సేకరించిన నిందితుడి వాంగ్మూలాలు, డిలీట్ చేసిన వాట్సాప్ చాట్లు, ఫోన్ కాల్ డేటా (CDR), ట్విషా శర్మ మెడికల్ రికార్డులను సీబీఐ అధికారులు నిశితంగా పరిశీలిస్తున్నారు.
అత్యున్నత కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి దిగడంతో తమ కుమార్తె మృతికి కారణమైన వారికి కఠిన శిక్ష పడుతుందని, తమకు న్యాయం జరుగుతుందని ట్విషా శర్మ కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో…


