Nara Lokesh Mahanadu | లోకేశ్ సస్పెన్స్ ట్వీట్.. ఆ ‘కీలక ప్రకటన’ ఏంటి?

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nara Lokesh Mahanadu | తెలుగుదేశం పార్టీ వార్షిక పండుగ ‘మహానాడు’ వేడుకల్లో ఇప్పుడు అందరి చూపు యువనేత, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ వైపే ఉంది. ఇటీవల టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన మహానాడు వేదికగా చేయబోతున్న తొలి ప్రసంగంపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. దీనికి తోడు, తాను ఒక ‘భారీ ప్రకటన’ (Big Announcement) చేయబోతున్నట్లు లోకేశ్ స్వయంగా సాషల్ మీడియా ద్వారా వెల్లడించడంతో ఏపీ రాజకీయాలతో పాటు నెటిజన్లలోనూ ఉత్కంఠ రేపుతోంది.

Nara Lokesh Mahanadu | లోకేశ్ సోషల్ మీడియా పోస్ట్ వైరల్..

“మధ్యాహ్నం 12 గంటలకు వర్కింగ్ ప్రెసిడెంట్‌ హోదాలో నా మొదటి ప్రసంగం ఉంటుంది. ఒక కీలకమైన భారీ ప్రకటన చేయబోతున్నాను.. వేచి చూడండి” అంటూ నారా లోకేశ్ చేసిన ఎక్స్ (ట్విట్టర్) పోస్ట్ ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారింది. ఈ అప్‌డేట్‌తో పార్టీ శ్రేణులు, యువతలో జోష్ పెరిగింది. అసలు లోకేశ్ ఏం ప్రకటించబోతున్నారు? అది యువతకు సంబంధించినదా లేక పార్టీ భవిష్యత్తు ప్రణాళికలా? అనే చర్చ జోరుగా సాగుతోంది. లోకేశ్ చేసిన ఈ పోస్ట్‌కు సోషల్ మీడియాలో నెటిజన్లు నుంచి భారీగా స్పందన వస్తోంది. కొత్త బాధ్యతల్లో ఆయన ప్రయాణం విజయవంతం కావాలని కోరుకుంటూ.. ఆయన స్పీచ్, భారీ అనౌన్స్‌మెంట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నామంటూ కామెంట్లు పెడుతున్నారు.

maha

Nara Lokesh Mahanadu | ఘనంగా ప్రారంభమైన వేడుకలు..

ఇదిలా ఉండగా, రెండు రోజుల పాటు సాగే ‘మహానాడు 2026’ బుధవారం ఉదయం లాంఛనంగా ప్రారంభమైంది. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఆవిష్కరించి, వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

lokeesh 1

ఉదయం 10:10 గంటలకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ప్రారంభ ఉపన్యాసంతో కార్యక్రమాలు మొదలయ్యాయి. ఈ ఏడాది మహానాడును ‘స్త్రీ శక్తి’ థీమ్‌తో పాటు వినూత్నంగా హైబ్రిడ్ (డిజిటల్ + ఫిజికల్) పద్ధతిలో నిర్వహిస్తున్నారు. ఈ రెండు రోజుల వేడుకల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు వివిధ అంశాలపై మొత్తం 20 కీలక తీర్మానాలను ప్రవేశపెట్టి ఆమోదించనున్నారు.

ఇది కూడా చదవండి: ED Raids Kerala | కేరళ మాజీ సీఎం నివాసాల్లో ఈడీ దాడులు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *