అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Indians in America | అగ్రరాజ్యం అమెరికాలో భారతీయులపై వేధింపులు, అవమానాలు పెరుగుతున్నాయి. తాజాగా ఇద్దరు భారతీయులను ఓ అమెరికా పౌరుడు అవమానించాడు. తమ దేశం విడిచి వెళ్లాలని పేర్కొన్నాడు.
భారత్కు చెందిన ఇద్దరు రోడ్డుపై నిల్చుని ఉండగా అమెరికాకు చెందిన వ్యక్తి వచ్చాడు. వారిని మీరు భారతీయుల అని ప్రశ్నించారు. అందుకు వారు అవునని సమాధానం చెప్పారు. సదరు అమెరికా పౌరుడు భారతీయులను మీకు ఇండియా ఇష్టమా, అమెరికానా అని ప్రశ్నించాడు. రెండు ఇష్టమని వారు చెప్పారు. అయితే భారత్ ఇష్టమైతే ఇక్కడకు ఎందుకు వచ్చారని సదరు వ్యక్తి అసభ్యంగా మాట్లాడాడు. ఇక్కడికి ఎందుకు వచ్చారు, మా దేశంలో మీరు ఉండడం మాకు ఇష్టం లేదు, మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి అంటూ అసభ్య పదజాలంతో దూషించాడు. ఇందుకు సంబంధించిన వీడియోను సదరు వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
Indians in America | భద్రత కరువు
అమెరికాలో భారతీయులకు భద్రత కరువు అవుతోంది. ఇటీవల భారతీయ విద్యార్థులు, ఉద్యోగులపై తరచూ దాడులు జరుగుతున్నాయి. భారతీయులను లక్ష్యంగా చేసుకొని బహిరంగంగా విమర్శలు చేస్తున్నారు. గతంలో పలువురు భారతీయులపై కాల్పులు జరిగిన ఘటనలు సైతం ఉన్నాయి. ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భారతీయుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తున్నారు. మరోవైపు అక్కడి పౌరుల్లో కొందరు సైతం భారతీయులపై ద్వేషంతో మెలుగుతున్నారు.
మా దేశంలో మీకేం పని.. మీ దేశానికి మీరు వెళ్ళిపోండి
అమెరికాలో భారతీయులకు అవమానం
ఇక్కడికి ఎందుకు వచ్చారు, మా దేశంలో మీరు ఉండడం మాకు ఇష్టం లేదు, మీ దేశానికి తిరిగి వెళ్ళిపోండి అంటూ భారతీయులను అవమానించిన ఓ అమెరికా వ్యక్తి pic.twitter.com/iJvrkNyK16
— News Line Telugu (@NewsLineTelugu) May 28, 2026
దీనిని కూడా చదవండి : Qaraoun Dam Israeli strikes | ఖరౌన్ ఆనకట్టపై ఇజ్రాయెల్ దాడులు: వ్యూహాత్మక పోరులో ‘జల రాజకీయం’


