Hamirpur Bridge Collapse | కూలిన భారీ వంతెన.. ఆరుగురు కార్మికుల మృతి

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Hamirpur Bridge Collapse | ఉత్తరప్రదేశ్‌ (Uttar Pradesh)లోని హమీర్‌పూర్‌లో బెట్వా నదిపై నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోయింది. తీవ్ర తుఫాను కారణంగా బ్రిడ్జిన కూలింది. ప్రమాదంలో ఆరుగురు కార్మికులు మృతి చెందగా, పలువురు శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం.

ఉత్తరప్రదేశ్‌లోని హమీర్‌పూర్ జిల్లా (Hamirpur District)లో గురువారం రాత్రి తుఫాను కారణంగా నిర్మాణంలో ఉన్న వంతెన కూలిపోవడంతో కనీసం ఆరుగురు కార్మికులు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది మొరకందర్ నుంచి కందౌర్ గ్రామం వరకు విస్తరించి ఉన్న ఈ వంతెనను బెట్వా నదిపై నిర్మిస్తున్నారు. ఈ ఘటన అర్ధరాత్రి 2 గంటల ప్రాంతంలో జరిగింది. ఆ సమయంలో కార్మికులు వంతెనలోని ఒక భాగంపై నిద్రిస్తున్నారు.

Hamirpur Bridge Collapse | భారీ వర్షంతో..

భారీ వర్షం, తుపానుతో వంతెన కూలిపోయింది. రాత్రి 2 గంటల ప్రాంతంలో ఒక స్లాబ్ కూలిపోయిందని, దాని కింద కొందరు చిక్కుకున్నారని సమాచారం అందిన వెంటనే తాము సంఘటనా స్థలానికి చేరుకున్నట్లు హమీర్‌పూర్ ఏఎస్పీ అరవింద్ కుమార్ వర్మ తెలిపారు. ఎస్​డీఆర్​ఎఫ్​ బృందాలు (SDRF Teams) సహాయక చర్యలు చేపట్టాయి. ఇప్పటి వరకు ఐదు మృతదేహాలను వెలికి తీసినట్లు ఆయన ర్కొన్నారు.

Hamirpur Bridge Collapse | మృతుల వివరాలు

ప్రమాదంలో మృతి చెందిన వారిని చిల్లాకు చెందిన లోకేంద్ర (22), కుల్దీప్ నిషాద్ (19), భూరగడ్​కు చెందిన సావంత్ యాదవ్ (28), సబజిత్​, స్వసా ఖుర్దు నివాసి పుష్పేంద్ర సింగ్ చౌహాన్ (34), అచ్‌పురా వాసి రాజేష్ పాల్ (42) గా గుర్తించారు. స్తంభంపై చిక్కుకుపోయిన మరో ముగ్గురిని అవధేష్ నిషాద్, కల్లు యాదవ్, రాజేష్ నిషాద్‌గా గుర్తించారు. మరో ఇద్దరు కూలీలను పోలీసులు రక్షించారు. ఇంకా ఎవరైన శిథిలాల కింద చిక్కుకున్నారా అని సహాయక చర్యలు చేపడుతున్నారు.

ఇది కూడా చదవండి..: Karnataka CM Resignation | ముఖ్యమంత్రి Siddaramaiah రాజీనామా ఆమోదం

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *