నిజామాబాద్Goud Student Felicitation | గౌడ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి

Goud Student Felicitation | గౌడ విద్యార్థులు ఉన్నత స్థానాల్లో నిలవాలి

గౌడ సమాజ అభ్యున్నతికి విద్యే ప్రధాన ఆయుధమని, గౌడ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు.

అక్షరటుడే, ఎల్లారెడ్డి: Goud Student Felicitation | గౌడ సమాజ అభ్యున్నతికి విద్యే ప్రధాన ఆయుధమని, గౌడ విద్యార్థులు ఉన్నత చదువులు అభ్యసించి సమాజానికి ఆదర్శంగా నిలవాలని జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ పిలుపునిచ్చారు. కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని కర్షక్ బీఈడీ కళాశాల (Karshak B.Ed. College)లో శుక్రవారం ఎస్సెస్సీ, ఇంటర్​ పరీక్షల్లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన గౌడ వి విద్యార్థులను ఘనంగా సన్మానించారు. వారిని ‘ప్రతిభ పురస్కారాలు’ అందజేశారు.

Goud Student Felicitation | నేటి యువత విద్యలో రాణించాలి

ఈ సందర్భంగా డాక్టర్ వట్టికూడి రామారావు గౌడ్ మాట్లాడుతూ.. నేటి యువత విద్యలో రాణించి ఉన్నత స్థానాలకు చేరుకుంటేనే గౌడ సమాజానికి గౌరవం పెరుగుతుందన్నారు. విద్యార్థులు కష్టపడి చదివి ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉన్నత పదవులు సాధించాలని సూచించారు. గౌడ సమాజంలోని ప్రతి కుటుంబం తమ పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలన్నారు. అనంతరం ప్రతిభ కనబర్చిన విద్యార్థులను శాలువాలు, మెమెంటోలు అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పాల్గొన్న వక్తలు గౌడ కుల చరిత్ర, గొప్పతనం, సంస్కృతి, సంప్రదాయాల గురించి విశదీకరించారు. కౌండిన్య మహర్షి మహాత్మ్యం, గౌడ కులదేవతల వైభవం, వీరశూరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ చేసిన త్యాగాలు, సమాజ సేవలను స్మరించుకున్నారు.

Goud Student Felicitation | పాపన్న గౌడ్​ ఆశయాలను..

పాపన్న గౌడ్ ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని సమాజాభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా విద్యార్థులను ఉన్నత చదువులు చదివిస్తున్న తల్లిదండ్రుల కృషిని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం రాష్ట్ర అధ్యక్షుడు గుండ్రాతి నారాయణ గౌడ్, అధికార ప్రతినిధి దత్తాత్రి గౌడ్, యూత్ అధ్యక్షుడు క్రాంతి కుమార్ గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, రాష్ట్ర యూత్ విభాగం అధ్యక్షుడు బొమ్మగోని శంకర్ గౌడ్, కేశవ్ గౌడ్, కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోళ్ల మురళి గౌడ్, ప్రధాన కార్యదర్శి అంకన్నగారి శ్రీనివాస్ గౌడ్, పెద్ద మల్లారెడ్డి సొసైటీ ఛైర్మన్ రాజా గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, కర్రోల్ల శేఖర్ గౌడ్, బొంబోతుల నరేష్ గౌడ్, ప్రకాష్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, ప్రశాంత్ గౌడ్, సుదర్శన్ గౌడ్, రామా గౌడ్, సురేష్ గౌడ్, దేవేందర్ గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి..: Fuel Prices | ప్రజా వ్యతిరేక విధానాలను మోదీ ప్రభుత్వం విడనాడాలి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Minister Quarters Swimming Pool | తెలంగాణ రాష్ట్రంలో క్రీడలను...

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Japan Population Crisis | జపాన్.. సాంకేతికతకు మారుపేరు....

VH Criticizes Congress Ministers | మంత్రులూ.. పద్ధతి మార్చుకోండి: సొంత ప్రభుత్వంపై ‘వీహెచ్‌’ ఫైర్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: VH Criticizes Congress Ministers | తెలంగాణ రాష్ట్రంలో అధికార...

Hormuz Strait Blockade | హార్ముజ్ జలసంధిపై దిగ్బంధనం ఎత్తివేత.. అమెరికా అధ్యక్షుడు కీలక ప్రకటన

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hormuz Strait Blockade | వ్యూహాత్మకంగా ఎంతో ప్రాధాన్యం...