May 30 Horoscope | కష్టాలకు ఇక ఎండ్​ కార్డ్​.. ఈ రాశుల వారికి నేడు ఆకస్మిక ధన యోగం!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: May 30 Horoscope | గ్రహాల సంచారంలో వస్తున్న కీలక మార్పుల వల్ల కొన్ని రాశుల వారికి గత కొంతకాలంగా వేధిస్తున్న దీర్ఘకాలిక ఆర్థిక ఇబ్బందులన్నీ నేటి (శనివారం, మే 30) తో పూర్తిగా తొలగిపోనున్నాయి.

కొన్ని రాశుల వారికి ఆకస్మిక ధనలాభాలు కలగడంతో పాటు, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న పాత బకాయిలు వసూలు అవుతాయి. అయితే, ఇదే సమయంలో మరికొన్ని రాశుల వారికి నక్షత్ర బలం కాస్త బలహీనంగా ఉన్నందున.. వారు తమ ఆరోగ్యం పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని జ్యోతిష్య పండితులు హెచ్చరిస్తున్నారు.

akshara today 1 3.jpghoroscop 3

May 30 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: చాలా రోజులుగా వేధిస్తున్న ఆర్థిక సమస్యలు ఈరోజుతో తొలగిపోతాయి. అనుకోని ఆర్థిక లాభాలు పొందుతారు. ఇవాళ మీరు అనారోగ్యంతో కొంచెం బలహీనంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీలైనంత వరకు దూర ప్రయాణాలను వాయిదా వేసుకోండి.

May 30 Horoscope | సమాజంలో మంచి పేరు

వృషభ రాశి: ఇవాళ భూమి, రియల్ ఎస్టేట్ లేదా సాంస్కృతిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టడం మంచిది. కష్టాల్లో ఉన్నవారికి మీ శక్తిమేర సహాయం చేయండి.. దీనివల్ల సమాజంలో మంచి పేరు, గుర్తింపు లభిస్తాయి. అలాగే ఊహించని ఆర్థిక లాభాలు కలిగే అవకాశం కూడా ఉంది.

మిథున రాశి: గ్రహాల అనుకూలత వల్ల అనారోగ్యం నుంచి త్వరగా కోలుకుంటారు. పెట్టుబడుల విషయంలో కొత్త ఆలోచనలతో ముందడుగు వేయండి. అనుభవజ్ఞులైన వారి సలహా తీసుకుని డబ్బును మదుపు (ఇన్వెస్ట్) చేయడం వల్ల మంచి విజయం సాధిస్తారు. పని విషయంలో మీరు పడుతున్న కష్టానికి, శ్రమకు తగిన గుర్తింపు, మంచి ఫలితాలు లభిస్తాయి.

akshara today 1 2.jpghoroscop 2

May 30 Horoscope | ఆప్తుడితో ఊరట

కర్కాటక రాశి: ఇంట్లోని సమస్యలను మీ తెలివితేటలతో, పరపతితో పరిష్కరించుకుంటారు. ఒక ప్రత్యేకమైన స్నేహితుడు లేదా ఆప్తుడు మీ బాధను పంచుకుని, మనసుకు ఎంతో ఊరటనిస్తారు. ఇవాళ అనుకోకుండా కొన్ని అనవసర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు.

సింహ రాశి: మీ సంకల్ప బలంతో ఒక క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కొని అందరి ప్రశంసలు పొందుతారు. గతంలో చేసిన మితిమీరి ఖర్చుల ప్రభావం ఇవాళ చూపిస్తుంది. అత్యవసర సమయానికి చేతిలో డబ్బు ఆడక ఇబ్బంది పడవచ్చు. వ్యక్తిగత, కుటుంబ విషయాలను సాధారణ పరిచయస్థులతో పంచుకోకపోవడం మంచిది.

May 30 Horoscope | ధ్యానంతో ప్రారంభం..

కన్యా రాశి: ఇవాళ యోగా, ధ్యానంతో ప్రారంభించండి. దీనివల్ల రోజంతా మీలో శక్తి, ఉత్సాహం ఉంటాయి. విదేశాల్లో చదువుకోవాలని ఆశపడే విద్యార్థులకు, ఇంటి ఆర్థిక పరిస్థితులు కాస్త నిరాశను, బాధను కలిగించవచ్చు. ఇంట్లో జరిగే కొన్ని చిన్నపాటి కలహాలు కాస్త బాధకు గురిచేసే అవకాశం ఉంది.

తులా రాశి: పొదుపు చేయాలనుకునే ప్రయత్నాలకు ఇవాళ అంతగా కలిసిరాకపోవచ్చు. అయినా దిగులు పడకండి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు, ట్రేడింగ్ రంగాల వారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. కుటుంబ విషయాల వల్ల వైవాహిక జీవితంలో చిన్నపాటి ఇబ్బందులు రావచ్చు.

akshara today 1 4.jpg horosco 4

May 30 Horoscope | మిగతా రాశులు..

వృశ్చిక రాశి: ఇవాళ ఎవరికీ అప్పు ఇవ్వకండి. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఇవ్వాల్సి వస్తే, లిఖితపూర్వకంగా మాత్రమే ఇవ్వండి. భాగస్వామి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది, ఇది కాస్త మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీరు అనుకున్న పనులు చాలా వరకు పూర్తవుతాయి. దీనివల్ల ఈ రోజంతా ఎంతో సంతోషంగా సాగుతుంది.

ధనుస్సు రాశి: బంగారం, వెండి ఆభరణాలు లేదా అలంకరణ వస్తువులపై పెట్టే పెట్టుబడులు (ఇన్వెస్ట్‌మెంట్స్) మంచి లాభాలను, అభివృద్ధిని తెచ్చిపెడతాయి. కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో లేదా బంధుమిత్రుల వేడుకల్లో పాల్గొంటారు. మీలో ఉన్న మంచి లక్షణాలు ఇతరుల నుంచి ప్రశంసలు అందుకునేలా చేస్తాయి.

మకర రాశి: చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు ఇవాళ కూడా ముందుకు సాగవు. పెరుగుతున్న ఖర్చులు మనసుకు కాస్త ఆందోళన కలిగిస్తాయి. ఇవాళ చేసే ప్రయాణాలు కొత్త ప్రదేశాలను చూసేందుకు, ముఖ్యమైన వ్యక్తులను కలవడానికి ఉపయోగపడతాయి.

కుంభ రాశి: ఇంటికి అనుకోకుండా ఒక అతిథి వచ్చే అవకాశం ఉంది. వారి వల్ల ఊహించని విధంగా ఆర్థిక ప్రయోజనాలు లేదా ధనలాభం కలుగుతుంది. మీకున్న పాజిటివ్ ఆలోచనలు, తెలివితేటలతో ఎలాంటి శారీరక, మానసిక సమస్యలనైనా సులభంగా జయించగలరు.

మీన రాశి: గ్రహాల అనుకూలత వల్ల ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. ధనలాభం కలిగే అద్భుతమైన అవకాశాలు ఉన్నాయి. మీరు ప్రారంభించాలనుకునే కొత్త ప్రాజెక్ట్‌లు లేదా వ్యాపార ప్లాన్ల గురించి తల్లిదండ్రులకు చెప్పడానికి ఇది చాలా మంచి సమయం. పూర్తి ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి, కొత్త వ్యక్తులతో పరిచయాలు, కాంటాక్ట్‌లను పెంచుకోండి. ఇది భవిష్యత్తుకు ఉపయోగపడుతుంది.

Japan Mango Export Ban | పాలకుల నిర్లక్ష్యం.. పర్యవేక్షణ లోపం…..

Japan Population Crisis | సూర్యుడు ఉదయించే దేశంలో.. శృంగార అస్తమయం!

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *