Sep 29 Horoscope | లవ్ లైఫ్‌లో ఊహించని బిగ్ ట్విస్ట్.. త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కేది ఈ రాశుల వారే

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం దిన, వార, సంవత్సర రాశి ఫలాలను పండితులు అందిస్తుంటారు. ఇక్కడ ఇచ్చినవి నేటి రాశి ఫలాలు... రాశుల వారీగా వాటిని తెలుసుకుందాం..

Naresh Chandan

అక్షరటుడే, వెబ్​డెస్క్: Sep 29 Horoscope | గ్రహాల సంచారం ప్రకారం ఈ రోజు (మంగళవారం, సెప్టెంబరు 29) కొన్ని రాశుల వారికి అద్భుతమైన ధన లాభం, ఉద్యోగంలో పురోగతి లభించబోతుండగా.. మరికొన్ని రాశుల వారికి మాత్రం మిశ్రమ ఫలితాలు సూచిస్తున్నాయి. విశేషించి ఇవాళ కొందరికి ప్రేమ, వైవాహిక జీవితంలో ఊహించని తీపి మలుపులు ఎదురైనా, పనివేళల్లో కాస్త జాగ్రత్త అవసరం.

Sep 29 Horoscope | రాశుల వారీగా..

మేష రాశి: Sep 29 Horoscope | ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. పెద్ద ప్లాన్‌లతో వచ్చే వారిని నమ్మేముందు, పెట్టుబడి పెట్టేముందే అన్ని వివరాలు సరిగ్గా సరిచూసుకోండి. ఆఫీసులో మీరు చేసిన మంచి పనులకు తగిన గుర్తింపు, ప్రశంసలు దక్కుతాయి. ప్రయాణాలు అలసట కలిగించినా, చివరకు శుభ ఫలితాలనే ఇస్తాయి.

వృషభ రాశి: Sep 29 Horoscope | గతంలో చేసిన పెట్టుబడుల నుంచి అనుకోకుండా లాభాలు పొందుతారు. సాయంత్రం వేళల్లో పాల్గొనే కార్యక్రమాలు మంచి వినోదాన్ని, ఉత్సాహాన్ని ఇస్తాయి. ఖాళీ సమయంలో చదివే పుస్తకాలు మీలోని అనేక సమస్యలకు పరిష్కారం చూపుతాయి.

మిథున రాశి: Sep 29 Horoscope | కొత్త పెట్టుబడి అవకాశాలను క్షుణ్ణంగా అధ్యయనం చేశాకే కమిట్ అవ్వండి. పాత బంధుత్వాలను , సంబంధాలను పునరుద్ధరించుకోవడానికి ఇది మంచి రోజు. ప్రేమ జీవితంలో ఉన్నవారికి ఇవాళ ఎంతో అద్భుతంగా, సంతోషంగా గడుస్తుంది. చేపట్టిన పనులన్నీ విజయవంతమై మీలోని ప్రతిభకు తగిన ప్రతిఫలం దక్కుతుంది.

Justice Aparesh Kumar Singh | సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ అపరేష్ కుమార్‌ సింగ్..కొలీజియం సిఫార్సు!

కర్కాటక రాశి: ఎలాంటి పరిస్థితిలోనూ ఓర్పు, విలువలను కోల్పోకుండా నిదానంగా ఆలోచించండి. పర్యావరణ రంగానికి చెందిన ప్రాజెక్టులలో పెట్టుబడులు పెడితే లాభాలు అందుతాయి. క్లిష్ట సమయాల్లో కుటుంబ సభ్యులు మీకు సంపూర్ణ అండగా నిలుస్తారు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి చిన్నపాటి కోర్సుల్లో చేరడం మంచిది.

సింహ రాశి: Sep 29 Horoscope | దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం లభించి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. వ్యాపారంలో పాత స్నేహితుడు ఇచ్చే సలహాలు మీకు ఆర్థికంగా కలసివస్తాయి. ఆఫీసులో అనుకూల వాతావరణం ఉండి మీ పనులన్నీ వేగంగా పూర్తవుతాయి.

కన్యా రాశి: Sep 29 Horoscope | ఉమ్మడి వ్యాపారాలు లేదా ఊహాజనిత పెట్టుబడులకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. స్నేహితులు , భాగస్వామి అందించే ఆత్మీయత మీకు ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. ఖాళీ సమయాన్ని పుస్తక పఠనం లేదా సంగీతం వంటి ఇష్టమైన పనులకు కేటాయిస్తారు. ఆఫీసు రాజకీయాలకు దూరంగా ఉంటే ఉద్యోగంలో మీదే పైచేయి కానుంది.

తులా రాశి: Sep 29 Horoscope | భాగస్వామి ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంది. చేతిలో తగినంత ధనం ఉండటంతో ఆర్థికంగా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇతరులలో తప్పులు వెతకడం మానేసి సమయాన్ని సానుకూలంగా వాడుకోండి. ప్రేమ కథ ఊహించని మలుపు తిరిగి వివాహ ప్రతిపాదన వరకు వెళ్తుంది.

వృశ్చిక రాశి: Sep 29 Horoscope | కోపాన్ని అదుపులో ఉంచుకుని నిగ్రహంతో వ్యవహరిస్తే సమస్యల నుంచి బయటపడవచ్చు. గత అప్పులు తీర్చని వారికి మళ్లీ రుణాలు ఇవ్వకపోవడమే మంచిది. విదేశీ వ్యాపారంలో ఉన్నవారికి అనుకున్న ఫలితాలు వచ్చి మంచి లాభాలు దక్కుతాయి. ఆఫీసులో ఉద్యోగులు తమ పనితనంతో అధికారుల మెప్పు పొందుతారు.

ధనుస్సు రాశి: ప్రయాణాల్లో ఉన్నప్పుడు మీ వస్తువుల పట్ల జాగ్రత్తగా ఉండండి. ఇంటికి అతిథుల రాకతో సాయంత్రం వేళ వాతావరణం పండుగలా మారుతుంది. ఆఫీసులో పెండింగ్ పనులను వేగంగా పూర్తిచేయడం మంచిది. ప్రాధాన్యం లేని పనులపై సమయం వృథా చేయకుండా లక్ష్యంపై దృష్టి పెట్టండి.

మకర రాశి: రోజు ద్వితీయార్థంలో ఆర్థిక పరిస్థితి గణనీయంగా మెరుగుపడి ఉపశమనం ఇస్తుంది. కుటుంబంలో ప్రశాంతతను, ఆనందాన్ని నింపే ఒక శుభవార్త అందుతుంది. నిరంతర శ్రమ, ఓర్పుతో వ్యవహరించడం వల్ల అనుకున్న లక్ష్యాలను చేరుకుంటారు.

కుంభ రాశి: ఊహించని మార్గాల ద్వారా ధన లాభం కలిగి ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయి. ఆఫీసులో అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకుండా మౌనంగా ఉండటమే శ్రేయస్కరం. అవసరమైన సమయాల్లో స్నేహితులు మీకు అండగా నిలిచి సహాయం అందిస్తారు.

మీన రాశి: పెట్టుబడులు పెట్టేముందు అనుభవజ్ఞులైన నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం. కుటుంబంతో కలిసి సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనస్సుకు ఆహ్లాదం లభిస్తుంది. మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి ఆశించిన అవకాశాలు వచ్చి కష్టానికి తగిన ఫలితం దక్కుతుంది.

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *