Rain Forecast | నేడు పలు జిల్లాలకు వర్ష సూచన

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Rain Forecast | రాష్ట్రాన్ని అకాల వర్షాలు వీడటం లేదు. రోజుకో ప్రాంతంలో వానలు పడుతున్నాయి. రోజంతా భానుడు భగభగ మండుతుండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే సాయంత్రం కాగానే పలు వాతావరణం ఒక్కసారిగా మారిపోతుంది. అక్కడక్కడ ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు (Heavy Rains) కురుస్తున్నాయి.

Rain Forecast | రాత్రివేళలో..

Rain Forecast

రాష్ట్రంలో శనివారం సైతం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆదిలాబాద్​, ఆసిఫాబాద్​, కామారెడ్డి (Kamareddy), మెదక్, సిద్దిపేట, నాగర్​కర్నూల్ జిల్లాల్లో రాత్రివేళ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. సాయంత్రం వరకు వాతావరణం పొడిగా ఉంటుంది. ఉత్తర, తూర్పు తెలంగాణ జిల్లాల్లో హీట్​వేవ్​ కొనసాగుతోంది. పలు ప్రాంతాల్లో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. హైదరాబాద్​ (Hyderabad) నగరంలో 41-42 డిగ్రీలు రికార్డు అయ్యే ఛాన్స్​ ఉంది.

Rain Forecast | జూన్​ 1 నుంచి..

Rain Forecast

ఉక్కపోత నుంచి ప్రజలకు జూన్ 1 తర్వాత ఉపశమనం లభిస్తుందని అధికారలు పేర్కొన్నారు. సోమవారం నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మొదటి వారంలో వర్షాలు పడుతాయని రైతులు అందుకు అనుగుణంగా ప్లాన్​ చేసుకోవాలని సూచించారు.

ఇది కూడా చదవండి..: Minister Quarters Swimming Pool | ఒలింపిక్స్‌లో ‘మినిస్టర్’ మెడల్ పక్కా? క్వార్టర్స్‌లో రూ.2.63 కోట్లతో స్విమ్మింగ్ పూల్!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *