జాతీయంAbhishek Banerjee Treatment | అభిషేక్ బెనర్జీకి చికిత్స వద్దంటూ ఒత్తిళ్లు : మమతా బెనర్జీ...

Abhishek Banerjee Treatment | అభిషేక్ బెనర్జీకి చికిత్స వద్దంటూ ఒత్తిళ్లు : మమతా బెనర్జీ ఆరోపణ

వైద్యులు కూడా ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారని, చివరకు సెలైన్ సహాయం అందించి, కుటుంబ వైద్యుల సలహాతో అభిషేక్ బెనర్జీని ఇంటికి పంపించినట్లు మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Abhishek Banerjee Treatment | తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ అభిషేక్ బెనర్జీకి వైద్య చికిత్స అందించకుండా దవాఖానాలు, నర్సింగ్ హోమ్‌లపై రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొస్తోందని మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు.

అధికారంలోకి వచ్చి నెల రోజులూ పూర్తికాకముందే భాజపా ప్రభుత్వం ఈ తరహా చర్యలకు పాల్పడుతోందని ఆమె తీవ్రంగా విమర్శించారు.

Abhishek Banerjee attack

Abhishek Banerjee Treatment | ఐసీయూలో చికిత్స..

అభిషేక్ బెనర్జీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని, వైద్యుల సూచన మేరకు రాత్రి 8:15 గంటలకు ఆయనను ఐసీయూలో చేర్చినట్లు మమతా బెనర్జీ తెలిపారు.

ఇదిలా ఉండగా.. టీఎంసీ రాజ్యసభ సభ్యుడు డెరెక్ ఓ’బ్రియన్ ఆసుపత్రి జారీ చేసిన లేఖను ఈ సందర్భంగా మీడియా సమావేశంలో చదివి వినిపించారు.

మే 30 తేదీతో ఉన్న ఆ లేఖ ప్రకారం.. అభిషేక్ బెనర్జీ రాత్రి 8:05 గంటలకు ఆసుపత్రికి చేరుకుని, రాత్రి 11 గంటలకు అక్కడి నుంచి వెళ్లినట్లు పేర్కొన్నారు.

ఈ సమయంలో ఆయనను ఇంటెన్సివ్ థెరపీ యూనిట్ (ఐటీయూ)లో ఉంచి అవసరమైన సహాయక చికిత్స అందించినట్లు లేఖలో వివరించారు.

Abhishek Banerjee Treatment | బెదిరింపు కాల్స్ వస్తున్నాయని..

తదుపరి మాట్లాడుతూ.. ఆసుపత్రి నిర్వాహకుడు తన వద్దకు వచ్చి పోలీసుల నుంచి, వివిధ వర్గాల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారని మమతా బెనర్జీ ఆరోపించారు.

అభిషేక్ బెనర్జీని ఆసుపత్రిలో చేర్చాలని వైద్యులు సూచించినప్పటికీ, ఆయనకు చికిత్స అందించవద్దని కొందరు బీజేపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్లు నిర్వాహకుడు చెప్పారని వాపోయారు.

akshara today .jpgattack

Abhishek Banerjee Treatment | ఇకపై ఇంటి వద్దే వైద్యం..

వైద్యులు కూడా ఈ పరిస్థితిపై విచారం వ్యక్తం చేశారని, చివరకు సెలైన్ సహాయం అందించి, కుటుంబ వైద్యుల సలహాతో అభిషేక్ బెనర్జీని ఇంటికి పంపించినట్లు మమతా బెనర్జీ చెప్పుకొచ్చారు.

ఇకపై ఆయనకు ఇంటి వద్దే చికిత్స అందించేందుకు కుటుంబ వైద్యుడు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. అయితే, మమతా బెనర్జీ చేసిన ఆరోపణలపై బీజేపీ, ప్రభుత్వ వర్గాల నుంచి ఎలాంటి స్పందన వెలువడలేదు.

Kerala fake study certificates | “డిగ్రీల దుకాణం”: చదివినవాడు నిరుద్యోగి……

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

NIA Explosives Raid | మలప్పురం పేలుడు పదార్థాల కేసు.. మూడు రాష్ట్రాల్లోని 19 చోట్ల ఏకకాలంలో ఎన్​ఐఏ సోదాలు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIA Explosives Raid | జాతీయ దర్యాప్తు సంస్థ...

Telangana Municipal Transfers | తెలంగాణలో భారీగా మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Municipal Transfers | తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన...

Double Bed Room Houses | పేదలకు దరిచేరిన గూడు.. లక్కీ డ్రా ద్వారా డబుల్​ బెడ్​ రూం ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Double Bed Room Houses | నిజామాబాద్​ నగరంలోని 30వ...

Warangal Super Specialty Hospital | ఉత్తర తెలంగాణకు వైద్య విప్లవం: వరంగల్‌లో త్వరలో ఉచిత కార్పొరేట్ వైద్యం!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Warangal Super Specialty Hospital | ఉత్తర తెలంగాణ...