అక్షరటుడే, వెబ్డెస్క్ : Mumbai Heavy Rains | ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రంతా కురిసిన కుండపోత వానలతో దక్షిణ-మధ్య, పశ్చిమ ముంబైలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
నైరుతి రుతుపవనాలు నిర్ణీత సమయం కంటే 13 రోజుల ఆలస్యంగా మంగళవారం ముంబైకి చేరుకున్నాయి. ఆ వెంటనే మొదలైన భారీ వర్షాల నేపథ్యంలో బుధవారం (జూన్ 24) ఉదయం ముంబై నగరం భారీ వర్షంతో మేల్కొంది. నగరంతో పాటు పొరుగున ఉన్న పాల్ఘర్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. గంటకు 40 నుండి 60 కిలోమీటర్ల వేగంతో వీచే గాలులతో కూడిన తీవ్రమైన లేదా అత్యంత తీవ్రమైన వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ (IMD) ‘రెడ్ అలర్ట్’ జారీ చేసింది.
Mumbai Heavy Rains | ట్రాఫిక్కు అంతరాయం
ముంబై నగరంలోని పలు ప్రాంతాల్లో(Mumbai Heavy Rains ) ఎనిమిది గంటల వ్యవధిలోనే 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీనివల్ల రోడ్లు జలమయమవ్వడమే కాకుండా తీవ్ర ట్రాఫిక్ అంతరాయాలు ఏర్పడ్డాయి. మంగళవారం రాత్రి 10 గంటల నుండి బుధవారం ఉదయం 6 గంటల మధ్య, పశ్చిమ సబర్బన్ ప్రాంతంలోని మల్వానీలో 272 మి.మీ వర్షపాతం నమోదైంది. కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో దాదర్ TT సమీపంలో ఒక కారుపై పెద్ద చెట్టు కూలిపడింది. అంధేరి సబ్‌వే, హింద్‌మాతా జంక్షన్, దాదర్, గాంధీ మార్కెట్ మరియు మలాడ్ సబ్‌వే వంటి లోతట్టు ప్రాంతాలు జలమయమై, ట్రాఫిక్ నిలిచిపోయింది.
#HeavyRains | ముంబైలో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం..
ముంబైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రంతా కురిసిన కుండపోత వానలతో దక్షిణ-మధ్య, పశ్చిమ ముంబైలోని కొన్ని ప్రాంతాలు అతలాకుతలం అయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.#MumbaiRains #Todayweather pic.twitter.com/v9cGSJ6dKg
— Akshara Today | Telugu News (@aksharatoday) June 24, 2026
దీనిని కూడా చదవండి : June 24 Gold Prices | అతివలకు గుడ్న్యూస్.. మరింత తగ్గిన బంగారం ధర!