US Sanctions India Companies | నాలుగు భారత కంపెనీలపై అమెరికా ఆంక్షలు

భారత్​కు చెందిన 4 కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : US Sanctions India Companies | ఇరాన్ పెట్రోలియం, పెట్రోకెమికల్ వాణిజ్యంలో పాల్గొన్నారనే ఆరోపణలపై నాలుగు భారత ఆధారిత కంపెనీలు, ముగ్గురు భారతీయులపై అమెరికా (America) ఆంక్షలు విధించింది. పోర్టీజ్ పార్ట్‌నర్స్ LLP, సదాశివ ఓవర్సీస్ లిమిటెడ్, PP సాఫ్ట్‌టెక్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రకృతిస్ ఇన్‌ఫ్రా ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలు ఆ జాభితాలో ఉన్నాయి.

కస్టమ్స్ బ్రోకర్ అయిన పోర్టీజ్ పార్ట్‌నర్స్‌పై, ఇరాన్ పెట్రోకెమికల్ ఉత్పత్తులను భారత్​కు దిగుమతి చేయడంలో సహకరించిందనే ఆరోపణలపై ఆంక్షలు విధించినట్లు స్టేట్ డిపార్ట్‌మెంట్ ఒక ప్రకటనలో తెలిపింది. సదాశివ ఓవర్సీస్ పలు కంపెనీల నుండి సుమారు 69 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకుందని ఆరోపించింది. పీపీ సాఫ్ట్‌టెక్ ప్రక్రుతీస్ ఇన్‌ఫ్రా సంస్థలు ఒక్కొక్కటి సుమారు 25 మిలియన్ డాలర్ల విలువైన ఇరాన్ పెట్రోలియం ఉత్పత్తులను దిగుమతి చేసుకున్నాయని పేర్కొంది.

US Sanctions India Companies | ఆర్థికంగా దెబ్బ తీయడానికి..

ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసే లక్ష్యంతో ఆ దేశంతో వ్యాపారం కొనసాగించే దేశాలను శిక్షిస్తామని ఈ వారం ప్రారంభంలో యునైటెడ్ స్టేట్స్ హెచ్చరించింది. కానీ వెంటనే జరిమానాలు విధించబోమని పేర్కొంది. ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ మధ్యప్రాచ్యంలోని కొన్ని దౌత్య కార్యాలయాలకు యూఎస్ సిబ్బందిని తిరిగి పంపడం ప్రారంభించింది. భవిష్యత్తులో ఇరాన్‌తో ఘర్షణ తీవ్రమయ్యే ప్రమాదం తక్కువగా ఉందని అమెరికా భావిస్తున్నట్లు సమాచారం.

ఇది కూడా చదవండి..: EWS Reservation | EWS కోటాపై అజయ్ అలోక్ కీలక వ్యాఖ్యలు.. సోషల్‌ మీడియాలో తీవ్ర చర్చ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *