అక్షరటుడే, వెబ్డెస్క్: Heavy Rain Alert | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో బుధవారం మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణుడు బాలజీ తెలిపారు. తూర్పు, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో రాత్రి, గురువారం తెల్లవారుజామున వర్షాలు కురుస్తాయని పేర్కొన్నారు.
పశ్చిమ, ఉత్తర, మధ్య తెలంగాణ (Telangana) జిల్లాల్లో నేడు మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవి విస్తృతంగా కాకుండా అక్కడక్కడా మాత్రమే పడుతాయి. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము సమయాల్లో సూర్యాపేట, మహబూబాబాద్, ఖమ్మం, భద్రాద్రి-కొత్తగూడెం, ములుగు, నల్గొండ, యాదాద్రి-భువనగిరి, వరంగల్ మరియు భూపాలపల్లి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి. మిగతా జిల్లాల్లో జల్లులు పడుతాయి. హైదరాబాద్ నగరంలో తేలికపాటి జల్లులు పడే ఛాన్స్ ఉంది.
Heavy Rain Alert | దంచికొట్టిన వాన
అల్ప పీడన ప్రభావంతో మూడు రోజులుగా రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, నదులు ఉధృతంగా పారుతున్నాయి. జలాశయాలు, చెరువులకు వరద వస్తోంది. మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం తెల్లవారుజామున వరకు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. ముఖ్యంగా అర్ధరాత్రి వాన దంచికొట్టింది.
ఇది కూడా చదవండి..: Kodada Road Accident | ఘోర రోడ్డు ప్రమాదం.. కంటైనర్ను ఢీ కొట్టిన ట్రావెల్ బస్సు.. ఆరుగురి దుర్మరణం!