Vijay Trisha | అజిత్ ఇంటికి కలిసి వెళ్లిన విజయ్, త్రిష

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Vijay Trisha | తమిళ సినీ పరిశ్రమలో ప్రముఖులైన విజయ్, త్రిష (Trisha) గురించి గత కొంతకాలంగా పలు ఊహాగానాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే వాటిపై సంబంధిత వ్యక్తులు ఎప్పుడూ అధికారికంగా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ ఘటన మరోసారి వారిద్దరినీ వార్తల్లో నిలిచేలా చేసింది.

కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ తల్లి మోహిని మణి రీసెంట్‌గా కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ విషాద సమయంలో అజిత్ కుటుంబాన్ని పరామర్శించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా ప్రముఖ నటి త్రిష కూడా ఆయనతో కలిసి వెళ్లడం అందరి దృష్టిని ఆకర్షించింది.

ajith 2

Vijay Trisha | అజిత్​ నివాసానికి..

అజిత్ (Ajith) నివాసానికి చేరుకున్న విజయ్, త్రిషలు మోహిని మణి పార్థివదేహానికి నివాళులర్పించారు. అనంతరం మాతృవియోగంతో బాధపడుతున్న అజిత్‌ను, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి సానుభూతి తెలిపారు. క్లిష్ట సమయంలో అండగా నిలవడం పట్ల పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ప్రశంసలు వ్యక్తం చేస్తున్నారు. అయితే విజయ్, త్రిష ఒకే వాహనంలో అజిత్ ఇంటికి రావడం సోషల్ మీడియాలో చర్చకు దారితీసింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు వైరల్ అవుతుండటంతో నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఇది సన్నిహిత స్నేహానికి నిదర్శనమని పేర్కొంటుండగా, మరికొందరు గతంలో వచ్చిన ఊహాగానాలను మళ్లీ ప్రస్తావిస్తున్నారు.

trisha 1

Vijay Trisha | సీఎం అయ్యాక..

విజయ్ ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత త్రిషతో కలిసి బహిరంగంగా కనిపించిన సందర్భాలు చాలా తక్కువగా ఉండటంతో ఈ పరిణామం మరింత ఆసక్తికరంగా మారింది. అయితే వారి వ్యక్తిగత సంబంధాల గురించి వస్తున్న ప్రచారాలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేకపోవడం గమనార్హం. అజిత్ కుటుంబానికి సానుభూతి తెలిపేందుకు వెళ్లిన‌ విజయ్, త్రిషల వీడియోలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతుండగా, ఈ ఘటన కోలీవుడ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దీనిని కూడా చదవండి : Abhishek Banerjee Treatment | అభిషేక్ బెనర్జీకి చికిత్స వద్దంటూ ఒత్తిళ్లు : మమతా బెనర్జీ ఆరోపణ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *