అక్షరటుడే, వెబ్డెస్క్: Telangana Employees Transfers | తెలంగాణ రాష్ట్ర (Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల బదిలీలపై నిషేధం ఎత్తివేసింది. ఇందుకు సంబంధించిన జీవోను జారీ చేసింది. మే ఒకటో తేదీ నుంచి 31 వరకు బదిలీలకు అవకాశం కల్పించింది. కాగా.. 2026 జనవరి ఒకటో తేదీ నాటికి మూడేళ్లుగా ఒకే చోట పనిచేస్తున్న ఉద్యోగులు ట్రాన్స్ఫర్స్ (Employees Transfers)కు అర్హులని వెల్లడించింది.

Telangana Employees Transfers | వీరికి మినహాయింపు
బదిలీల్లో పలువురికి మినహాయింపు ఇచ్చింది. నాలుగేళ్లకు మించి ఏ ఉద్యోగిని కూడా ఒకేచోట కొనసాగించరాదు. అయితే 2027 మే 31వ తేదీలోపు రిటైరయ్యే ఉద్యోగులను వారి అభ్యర్థన మేరకే బదిలీ చేయాల్సి ఉంటుంది. అలాగే ఏ కేడర్లో అయినా 40 శాతానికి మించి ఉద్యోగులను బదిలీ కూడదని స్పష్టం చేసింది.మానసిక వికలాంగులైన పిల్లలు ఉన్న ఉద్యోగులను వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్న ప్రదేశానికి మాత్రమే పంపాల్సి ఉంటుంది. స్పౌజ్ కేసులో భార్యాభర్తలలో ఒకరిని మాత్రమే బదిలీ చేయాలని పేర్కొంది. ఉద్యోగి జీవిత భాగస్వామి లేదా పిల్లలు, తల్లిదండ్రులు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్న ప్రదేశాలకు బదిలీ చేయాలి.
ఇది కూడా చదవండి..: Kavitha on BRS Meeting | బీఆర్ఎస్ జగిత్యాల సభపై కవిత సంచలన వ్యాఖ్యలు

