బిజినెస్​Windfall Tax Cut | పెట్రోల్, డీజిల్‌ ఎగుమతులపై పన్ను తగ్గింపు ఎవరికి లాభమంటే?

Windfall Tax Cut | పెట్రోల్, డీజిల్‌ ఎగుమతులపై పన్ను తగ్గింపు ఎవరికి లాభమంటే?

ఇంధన ఎగుమతులపై విధిస్తున్న విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ను కేంద్ర ప్రభుత్వం తగ్గించింది. దీంతో చమురు ఉత్పత్తులను ఎగుమతి చేసే సంస్థలకు ఊరట లభించింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్: Windfall Tax Cut | అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు దేశీయ మార్కెట్‌ (Domestic Market)లో ధరల కంటే అధికంగా ఉన్న సమయంలో ఎగుమతిదారులు ఎగుమతులకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశాలు ఉంటాయి.

ఈ నేపథ్యంలో ఎగుమతిదారులు పొందే అదనపు లాభాలను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్ ట్యాక్స్ విధానాన్ని అమలు చేస్తోంది. మార్కెట్‌లో అసాధారణ పరిస్థితుల కారణంగా ఏర్పడే అనూహ్య లాభాల్లో కొంత భాగాన్ని ప్రభుత్వ ఆదాయంగా మళ్లించడం ఈ పన్ను ప్రధాన ఉద్దేశం. ఇంధన ఎగుమతులపై విండ్‌ఫాల్ ట్యాక్స్‌ను మొదటిసారిగా 2022లో విధించారు.

Windfall Tax Cut | పక్షం రోజులకోసారి సమీక్ష..

Windfall Tax Cut

అంతర్జాతీయ ముడిచమురు, పెట్రోల్, డీజిల్, ఏటీఎఫ్ సగటు ధరల ఆధారంగా ప్రతి పక్షం రోజులకు ఒకసారి విండ్‌ఫాల్ ట్యాక్స్ రేట్లను సమీక్షిస్తారు. ఇటీవల మే 16న ఈ పన్నును పెంచారు. పెట్రోల్‌పై ఎగుమతి సుంకం లీటరుకు రూ. 3, డీజిల్‌పై రూ. 16.5, ఏటీఎఫ్‌పై రూ. 16గా ఖరారు చేశారు. తాజాగా ముడి చమురు ధరలు దిగిరావడంతో ఈ ట్యాక్స్ ను తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం (Central Government) నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్‌ను లీటరుకు రూ. 3 నుంచి రూ. 1.50కు, డీజిల్‌పై లీటరుకు రూ.16.50 నుంచి రూ.13.50కు తగ్గించారు. ఏవియేషన్ టర్బైన్ ఫ్యుయల్ (ఏటీఎఫ్ )పై విండ్‌ఫాల్ పన్నును లీటరుకు రూ. 16 నుంచి రూ .9.50కు తగ్గిస్తున్నట్లు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు.

Windfall Tax Cut | ఎవరికి లాభమంటే..

Windfall Tax Cut

ఎగుమతులపై మాత్రమే విండ్‌ఫాల్ గెయిన్స్ ట్యాక్స్ ఉంటుంది. కాబట్టి ఈ ట్యాక్స్ పెంచినా, తగ్గించినా దేశీయ వినియోగదారులపై ఎలాంటి ప్రభావం ఉండదు. పన్ను తగ్గించడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్, నయారా ఎనర్జీ వంటి ప్రధాన ప్రైవేట్ చమురు శుద్ధి సంస్థలతో పాటు ఓఎన్‌జీసీ, ఆయిల్ ఇండియా వంటి ప్రభుత్వ రంగ ఉత్పత్తి సంస్థలకు అంతర్జాతీయ వ్యాపారంలో ఉపశమనం లభించనుంది. సోమవారంనాటి ట్రేడింగ్‌లో ఈ కంపెనీల షేర్లు యాక్టివ్ గా ఉండే అవకాశాలున్నాయి.

ఇది కూడా చదవండి..: NSE Trading Hours | ట్రేడింగ్ సమయం మారిందోచ్ !

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...