Modi Summer Tips | ఎండలను తట్టుకోవడానికి మోదీ టిప్స్..

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Modi Summer Tips | ఈ ఏడాది దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వడగాల్పులతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఆ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Narendra Modi) దేశ ప్రజలకు కీలక సూచనలు చేశారు.

తన రేడియో కార్యక్రమం ‘మన్ కీ బాత్ ’ (‘Mann Ki Baat’)లో ఆయన దేశంలో నెలకొన్న ప్రస్తుత వాతావరణ పరిస్థితులపై ప్రత్యేకంగా మాట్లాడారు. వేసవి తీవ్రత నుంచి ప్రాణాలను కాపాడుకోవడానికి పలు సూచనలు ఇచ్చారు. శరీరాన్ని చల్లబరిచే సంప్రదాయ పానీయాలను తీసుకోవాలని సూచించారు.

Modi Summer Tips | ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ’ స్ఫూర్తిని చాటేలా..

Modi Summer Tips

ఎండలను తట్టుకోవడానికి మన దేశంలో అనాదిగా వస్తున్న విభిన్న సంప్రదాయ పానీయాలను ఈ వేసవిలో భాగం చేసుకోవాలని ప్రధాని మోదీ సూచించారు. ఈ పానీయాలు దాహాన్ని తీర్చడమే కాకుండా, శరీరానికి ఎంతో మేలు చేస్తాయన్నారు. ఇవి ‘ఏక్ భారత్ శ్రేష్ట్ భారత్ ’ స్ఫూర్తిని చాటుతాయన్నారు. ప్రజలంతా ఈ వేసవి కాలంలో ఈ దేశీ పానీయాలను తాగి ఆరోగ్యంగా ఉండాలని సూచించారు.

Modi Summer Tips | ప్రధాని సూచించిన పానీయాలివే…

  • ఉత్తర భారతదేశంలో లభించే ‘ఆమ్ పన్నా’ (పచ్చి మామిడికాయ రసం) ఎండ దెబ్బ తగలకుండా రక్షిస్తుంది.
  • పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో తాగే ‘లస్సీ’ శరీరానికి చలవ చేస్తుంది.
  • రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల ప్రజల భోజనంలో మజ్జిగ ఒక భాగం.
  • బీహార్, జార్ఖండ్, తూర్పు యూపీ ప్రాంతాల్లో తాగే ‘సత్తు శర్బత్ ’ (వేయించిన శనగపిండి పానీయం) కడుపు నింపడమే కాకుండా తక్షణ శక్తిని ఇస్తుంది.
  • కొంకణ్, గోవాలో దొరికే ‘కోకం శర్బత్ ’, ‘సోల్ కఢి’లు ఆరోగ్యానికి చాలా మంచివి.
  • దక్షిణాది రాష్ట్రాల్లో లభించే ‘పానకం’, ‘నీర్ మోర్ ’, ‘సంబారం’ వంటివి వేసవిలో చలవ చేయడమే కాకుండా శక్తిని ఇస్తాయి.
  • ఒడిశాలో ప్రత్యేకంగా తయారుచేసే ‘బేలా పన్నా’ (మారేడు పండ్ల రసం) ఆరోగ్యానికి ఎంతో మంచిది.

Modi Summer Tips | ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి..

Modi Summer Tips

ఈ వేసవిలో ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. తగినంత నీరు తాగలని, ఎండల్లో బయటకు వెళ్లేటప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని, ప్రభుత్వ శాఖలు జారీ చేస్తున్న వాతావరణ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని కోరారు.

ఇది కూడా చదవండి..: Ayodhya Kashi Tour | అయోధ్య, కాశి పుణ్య క్షేత్ర యాత్ర.. టూర్ ప్యాకేజీతో ముందుకొచ్చిన ఐఆర్‌సీటీసీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *