తెలంగాణTelangana Traffic Challan | వాహనదారులకు అలర్ట్: ఇకపై SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారానే ట్రాఫిక్...

Telangana Traffic Challan | వాహనదారులకు అలర్ట్: ఇకపై SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారానే ట్రాఫిక్ చలాన్లు!

నెల రోజుల్లోగా ‘వాహన్’ పోర్టల్‌లో వివరాలు అప్‌డేట్ చేసుకోవడం తప్పనిసరి – తెలంగాణ రవాణా శాఖ అధికారిక ఉత్తర్వులు జారీ.

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Traffic Challan | తెలంగాణలో వాహనదారులకు రవాణా శాఖ అత్యంత ముఖ్యమైన సమాచారాన్ని ప్రకటించింది. ఇకపై ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించిన చలాన్లను సంప్రదాయ కాగితపు రూపంలో కాకుండా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో పంపాలని నిర్ణయించింది.

ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ రవాణా, రహదారులు – భవనాల (TR-I) శాఖ అధికారిక జీవో (G.O.Ms.No. 25, తేదీ: 01-06-2026) విడుదల చేసింది. కొత్త నిబంధనల ప్రకారం, వాహనదారులకు చలాన్లను నేరుగా వారి మొబైల్ నంబర్లకు SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారా పంపిస్తారు.

Telangana Traffic Challan

Telangana Traffic Challan | నెల రోజులలోగా

కేంద్ర మోటారు వాహనాల నిబంధనలు (CMV Rules, 1989) లోని రూల్ 167 సబ్-రూల్ (1), (2) ప్రకారం ఎలక్ట్రానిక్ పద్ధతిలో చలాన్లు జారీ చేసేందుకు వీలుగా సబ్-రూల్ (3) ద్వారా పొందిన అధికారాలను వినియోగించుకుంటూ రవాణా శాఖ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.

రవాణా శాఖ కమిషనర్ పంపిన ప్రతిపాదనలను సర్కారు క్షుణ్ణంగా పరిశీలించి, జూన్ 2, 2026 నాటి తెలంగాణ గెజెట్ అసాధారణ సంచికలో ఈ నోటిఫికేషన్‌ను ప్రచురించాలని ఆదేశించింది.

Telangana Traffic Challan : వివరాలు అప్‌డేట్ చేసుకోకపోతే ఇబ్బందులే!

ప్రభుత్వ తాజా నోటిఫికేషన్ ప్రకారం రాష్ట్రంలోని వాహనదారులందరూ నెల రోజులలోగా (నోటిఫికేషన్ విడుదలైన తేదీ నుంచి) కేంద్ర ప్రభుత్వ అధికారిక ‘వాహన్’ (Vahan) పోర్టల్ (http://vahan.parivahan.gov.in) సందర్శించి, తమ ప్రస్తుత మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడీని తప్పనిసరిగా అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

tg

Telangana Traffic Challan | డిజిటల్ చలాన్లే అధికారిక నోటీసులు:

గడువు ముగిశాక, వాహన్ పోర్టల్‌లో నమోదై ఉన్న మొబైల్ నంబర్ లేదా ఇ-మెయిల్ ఐడీకి పంపిన డిజిటల్ చలాన్లను (SMS, WhatsApp, ఇ-మెయిల్ ద్వారా) సదరు వాహనదారుడికి నేరుగా అందిన అధికారిక నోటీసులు, సమన్లుగానే చట్టబద్ధంగా పరిగణిస్తారు. సమాచారం అందలేదనే సాకులు చెప్పడానికి వీలుండదని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది.

తెలంగాణ రవాణా శాఖ తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, చలాన్ల సమాచారం వాహనదారులకు తక్షణమే చేరుతుంది. దీనివల్ల నకిలీ నంబరు ప్లేట్లు, ఇతరుల పేర్లపై ఉన్న వాహనాల ద్వారా జరిగే ఉల్లంఘనలను అరికట్టడానికి వీలవుతుంది.

ఈ డిజిటల్ విధానానికి వాహనదారులందరూ సహకరించి, సకాలంలో తమ వివరాలను నమోదు చేసుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్ ఉత్తర్వులలో స్పష్టం చేశారు.

Paddy Procurement Assurance | రైతులు అధైర్యపడొద్దు.. తడిసిన ధాన్యం కొంటాం…

Naresh Chandan
Naresh Chandanhttps://aksharatodaynews.com/
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Germany Transit Visa | భారతీయులకు జర్మనీ బంపర్ ఆఫర్: ఇకపై ఎయిర్‌పోర్ట్ ట్రాన్సిట్ వీసా లేకుండానే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Germany Transit Visa | అంతర్జాతీయ ప్రయాణాలు చేసే భారతీయులకు...

Super El Nino | భూగోళాన్ని భయపెడుతున్న ‘సూపర్ ఎల్ నినో’: భారత్​పై ఎలాంటి ప్రభావం చూపనుందంటే..

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Super El Nino | ప్రపంచ వాతావరణాన్ని సమూలంగా...

Chain Snatcher Arrest | ఈ చైన్​ స్నాచర్ మామూలోడు కాదు సుమా​.. 180 కేసుల్లో నిందితుడు!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Chain Snatcher Arrest | ఉభయ తెలుగు రాష్ట్రాల్లో...

Iran Nuclear Negotiations | అణు చర్చలకు ఇరాన్ సుముఖత: అమెరికా విదేశాంగ మంత్రి మార్కో

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Iran Nuclear Negotiations | తమ అణు కార్యక్రమానికి...