అక్షరటుడే, వెబ్‌డెస్క్: June 02 Market Analysis | అమెరికా – ఇరాన్ శాంతి చర్చలపై నెలకొన్న అనిశ్చితిపై పెట్టుబడిదారులు అప్రమత్తంగా ఉన్నారు. దీంతో గ్లోబల్ మార్కెట్లు మిక్స్‌డ్‌గా సాగుతున్నాయి. గత సెషన్లో వాల్ స్ట్రీట్ లాభాలతో ముగియగా.. యూరోప్ మార్కెట్లు నష్టపోయాయి.
మంగళవారం ఉదయం ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ ఫ్యూచర్స్ డిస్కౌంట్ లో ట్రేడవుతోంది. ఇది భారత స్టాక్ మార్కెట్ సూచీలకు ప్రతికూల ప్రారంభాన్ని సూచిస్తోంది.
June 02 Market Analysis | యూఎస్ మార్కెట్లు..
గత సెషన్లో నాస్డాక్ 0.42 శాతం, ఎస్ అండ్ పీ 0.26 శాతం పెరిగాయి. మంగళవారం ఉదయం డౌజోన్స్ ఫ్యూచర్స్ 0.45 శాతం నష్టంతో ఉంది.
June 02 Market Analysis | యూరోప్ మార్కెట్లు..
యూకేకు చెందిన ఎఫ్టీఎస్ఈ 0.68 శాతం, ఫ్రాన్స్‌కు చెందిన సీఏసీ 0.45 శాతం, జర్మనీకి చెందిన డీఏఎక్స్ 0.41 శాతం నష్టపోయాయి.

June 02 Market Analysis | ఆసియా మార్కెట్లు..
ప్రధాన ఆసియా మార్కెట్లు మిక్స్‌డ్‌గా ఉన్నాయి. ఉదయం 8 గంటల ప్రాంతంలో హాంగ్‌కాంగ్‌కు చెందిన హాంగ్‌సెంగ్ 1.51 శాతం, సింగపూర్‌కు చెందిన స్ట్రెయిట్ టైమ్స్ 0.64 శాతం, తైవాన్ స్టాక్ ఎక్స్ఛేంజ్ 0.12 శాతం లాభాలతో ఉండగా.. సౌత్ కొరియాకు చెందిన కోస్పీ 2.28 శాతం, జపాన్‌కు చెందిన నిక్కీ 1.63 శాతం, చైనాకు చెందిన షాంఘై 0.15 శాతం నష్టాలతో కదలాడుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ, నిఫ్టీ 0.80 శాతం నష్టంతో ఉండడంతో మన మార్కెట్లు భారీ గ్యాప్ డౌన్లో ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి.
June 02 Market Analysis | ఆందోళన కలిగిస్తోన్న ద్రవ్యలోటు..
భారత్ ద్రవ్యలోటు ఏప్రిల్‌లో రూ. 3.62 లక్షల కోట్లకు పెరిగింది. 2025 ఏప్రిల్ నాటికి ద్రవ్యలోటు రూ. 1.86 లక్షల కోట్లుగా ఉంటుంది. ఇది గతేడాదితో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.
June 02 Market Analysis | ఐఐపీ గణాంకాలు..
పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (IIP) ప్రకారం భారత పారిశ్రామిక ఉత్పత్తి ఏప్రిల్‌లో గతేడాదితో పోలిస్తే 4.9 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్ 2025లో ఫ్యాక్టరీ ఉత్పత్తి 5.7 శాతం పెరగ్గా.. ఈసారి పెరుగుదలలో స్వల్ప తగ్గుదల కనిపిస్తోంది.

గమనించాల్సిన అంశాలు..
- ఎఫ్ఐఐలు వరుసగా 4వ సెషన్లోనూ నికర అమ్మకందారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 3,911 కోట్ల విలువైన స్టాక్స్ విక్రయించారు.
- డీఐఐ(DII)లు పదో సెషన్లోనూ నికర కొనుగోలుదారులుగా ఉన్నారు. గత సెషన్లో నికరంగా రూ. 5,109 కోట్ల విలువైన స్టాక్స్ కొన్నారు.
- నిఫ్టీ పుట్‌కాల్ రేషియో 0.74 నుంచి 0.69 కు తగ్గింది. ఇది ఈ ఏడాది ఫిబ్రవరి 27 తర్వాత అత్యల్ప స్థాయి. పీసీఆర్ 0.7 కన్నా దిగువన ఉండడం మార్కెట్ లో నెలకొన్న బేరిష్ మÖడ్ కు నిదర్శనం.
- విక్స్ 2.21 శాతం పెరిగి 16.54 వద్ద ఉంది.
- బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర బ్యారెల్‌కు 94.70 డాలర్ల వద్ద ఉంది.
- డాలర్‌తో రూపాయి మారకం విలువ 5 పైసలు బలపడి 94.99 వద్ద ఉంది.
- యూఎస్ డాలర్ ఇండెక్స్ 99.20 వద్ద, పదేళ్ల బాండ్ ఈల్డ్ 4.45 వద్ద ఉన్నాయి.
మధ్యప్రాచ్యంలో యుద్ధాన్ని ముగించేందుకు ఇరాన్‌తో కుదిరిన శాంతి ఒప్పందంలో వేగవంతమైన పురోగతి సాధిస్తున్నామని అమెరికా ప్రకటించగా.. లెబనాన్‌లో ఇజ్రాయెల్ చర్యలకు, బీరూట్ దక్షిణ ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని సైనిక చర్యకు పిలుపునివ్వడానికి నిరసనగా టెహ్రాన్ అన్ని శాంతి చర్చలను నిలిపివేసినట్లు సమాచారం. నిఫ్టీ డెరివేటివ్స్ వీక్లీ ఎక్స్పైరీ నేపథ్యంలో మార్కెట్లో ఒడుదుడుకులు ఉండే అవకాశాలున్నాయి.


