Akshara Today
  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • జిల్లాలు
    • నిజామాబాద్
    • హైదరాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • నల్గొండ
    • ఖమ్మం
    • మహబూబ్‌నగర్
  • సినిమా
  • More..
    • క్రైం
    • బ్లాగ్
    • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
    • టెక్నాలజీ
    • క్రీడలు
    • బిజినెస్​
    • భక్తి
    • లైఫ్​ స్టైల్​
Subscribe
  • 🔥
  • జిల్లాలు
  • హైదరాబాద్
  • సినిమా
  • లైఫ్​ స్టైల్​
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • బ్లాగ్
  • బిజినెస్​
  • భక్తి
  • టెక్నాలజీ
Akshara TodayAkshara Today
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్​
  • హైదరాబాద్
  • నిజామాబాద్
  • సినిమా
  • అంతర్జాతీయం
  • జాతీయం
  • క్రీడలు
  • క్రైం
  • టెక్నాలజీ
  • ఫ్యాషన్
  • బిజినెస్​
  • బ్లాగ్
  • భక్తి
  • జాబ్స్​ & ఎడ్యుకేషన్​
  • లైఫ్​ స్టైల్​
Search
  • Top Categories
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • ఆంధ్రప్రదేశ్​
    • సినిమా
  • జిల్లాలు
    • హైదరాబాద్
    • నిజామాబాద్
    • రంగారెడ్డి
    • ఆదిలాబాద్
    • మెదక్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • మహబూబ్‌నగర్
  • Pages
    • Home
    • About Us
    • Contact Us
    • Privacy Policy
    • Terms and Conditions
Follow US

Home - నిజామాబాద్

నిజామాబాద్

JEE Advanced Results | “మా విజయానికి మూలం కాకతీయే..!” జేఈఈ అడ్వాన్స్​డ్​ ర్యాంకర్ల మనోగతం

Naresh Chandan
Last updated: June 3, 2026, 11:47 am 11:47 am
Naresh Chandan
Share
JEE Advanced Results

అక్షరటుడే, వెబ్​డెస్క్: JEE Advanced Results | కృషి ఉంటే లభించని విజయం లేదు.. సరైన మార్గదర్శకత్వం తోడైతే సాధించలేని శిఖరం లేదని నిరూపించారు నిజామాబాద్ (Nizamabad) కాకతీయ విద్యాసంస్థల విద్యార్థులు.

ఇటీవల విడుదలైన జేఈఈ అడ్వాన్స్‌డ్-2026 ఫలితాలలో కాకతీయ ఐఐటీ/నీట్ అకాడమీ విద్యార్థులు ఆలిండియా స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించి, ఇటు విద్యాసంస్థకు, అటు నిజామాబాద్ జిల్లాకు జాతీయ స్థాయిలో ఘన కీర్తిని చేకూర్చారు.

స్కూలు స్థాయి నుంచే బలమైన పునాది, ఇంటర్మీడియట్‌లో అత్యుత్తమ ప్రణాళికతో బోధన అందించడం వల్ల విద్యార్థులు తమ మొదటి ప్రయత్నంలోనే ఈ ఘన విజయాన్ని సొంతం చేసుకున్నారని సంస్థ ఛైర్‌పర్సన్ సి.హెచ్. విజయలక్ష్మి, డైరెక్టర్, ఐఐటియన్ Ch. రామోజీరావు ప్రకటించారు.

జాతీయ స్థాయిలో ర్యాంకులు సొంతం చేసుకున్న సందర్భంగా విద్యార్థులు తమ మనోభావాలను అక్షరటుడేతో పంచుకున్నారు. తమ విజయానికి మూలం కాకతీయ విద్యా సంస్థలనేనని పేర్కొంటున్నారు. వివరాలు వారి మాటల్లోనే..

JEE Advanced Results | మొదటి ప్రయత్నంలోనే అద్భుత ర్యాంక్ – హెచ్. భరత్ (AIR: 1275)

JEE Advanced Results

 

 

“ఇంటర్మీడియట్ చదువుతూ, మొదటి ప్రయత్నంలోనే జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో 1275 ఆలిండియా ర్యాంక్ సాధించడం చాలా ఆనందంగా ఉంది. ఇంతటి అద్భుతమైన ర్యాంకు సాధించడానికి కాకతీయ కళాశాల డైరెక్టర్​ Ch. రామోజీరావు సర్​ అన్ని వేళలా అందుబాటులో ఉండి కౌన్సిలింగ్ ఇవ్వడమే కారణం. కాకతీయ అధ్యాపక బృందం అందించిన అద్భుతమైన కోచింగ్ వల్లే నేను ఈ రోజు ఈ స్థాయిలో నిలబడగలిగాను. భవిష్యత్తులో టాప్ ఐఐటీ లో సీఎస్ఈ (CSE) గ్రూప్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అవ్వాలన్నదే నా లక్ష్యం.”

JEE Advanced Results | ప్రణాళికాబద్ధమైన చదువే గెలిపించింది – జె. తన్విత (AIR: 1573)

JEE Advanced Results

“జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నాకు 1573 ఆలిండియా ర్యాంక్ రావడం ఎంతో సంతోషాన్ని ఇస్తోంది. నేను ప్రతిరోజూ ఎంతో ప్రణాళికాబద్ధంగా చదివేదాన్ని. ఐఐటియన్ అయిన మా డైరెక్టర్ Ch. రామోజీరావు సర్​ ఎప్పటికప్పుడు నిర్వహించిన పరీక్ష ఫలితాలను సమీక్షించి, నాకు ఎన్నో విలువైన సలహాలు, సూచనలు ఇచ్చారు. నా సొంత అనుభవంతో చెబుతున్నాను.. జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో రాణించాలంటే పాఠశాల స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ (IIT Foundation) బోధించే పాఠశాలలు ఎంతో దోహదపడతాయి.”

JEE Advanced Results | గురువుల నిరంతర శ్రమే ఈ ర్యాంక్ – బి. సంధ్య (AIR: 1627)

JEE Advanced Results

“మొదటి ప్రయత్నంలోనే 1627 ఆలిండియా ర్యాంక్ సాధించడం చాలా సంతోషంగా ఉంది. నాకు ఇంతటి ర్యాంకు రావడానికి కారణం మా ఉపాధ్యాయుల నిరంతర కృషి, అలాగే నా తల్లిదండ్రుల పూర్తి సహాయ సహకారాలు అందించారు. మా కళాశాల డైరెక్టర్​ Ch. రామోజీరావు మాకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ కౌన్సెలింగ్ ఇచ్చి ప్రోత్సహించారు. భవిష్యత్తులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గా ఉన్నతస్థాయిలో స్థిరపడతా.”

JEE Advanced Results | 100% పునాది వేసింది కాకతీయ ఒలింపియాడ్ స్కూలే – ఎ. అత్రిజ్ (AIR: 2361)

JEE Advanced Results

“నేను స్కూలు స్థాయిలో Kakatiya Olympiad School లో చదివాను. అక్కడ KOS లో ఐఐటీ/మెడికల్ ఫౌండేషన్ (IIT/Medical Foundation) శిక్షణ ప్రతిరోజు, ప్రతి సబ్జెక్టుపై ఇంటర్ – ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో మా డైరెక్టర్ Ch. రామోజీరావు & Ch. తేజస్విని పర్యవేక్షణలో ప్రణాళికాబద్ధంగా అమలయ్యేది. ఆ బలమైన ఫౌండేషన్ వల్లే ఇంటర్మీడియట్‌లో ఈ రోజు ఇంతటి అద్భుతమైన జాతీయ స్థాయి ర్యాంకు సాధించగలిగాను. విద్యార్థులు జాతీయ పరీక్షల్లో రాణించాలంటే స్కూలు స్థాయి నుంచే ఇంటర్, ఎంసెట్ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇచ్చే పాఠశాలల్లో చేరాలి. మా KOS నా విజయానికి 100% పునాది.”

స్కూలు స్థాయి ఫౌండేషనే విజయ రహస్యం: డైరెక్టరు బోర్డు

ఈ ఘన విజయంపై కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ Ch. రామోజీరావు (IITIAN) మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌లో ఆత్రుత పడితే జాతీయ స్థాయి పోటీ పరీక్షలలో రాణించలేరని, స్కూలు స్థాయి నుంచే ఐఐటీ ఫౌండేషన్ ఉదయం రెగ్యులర్ సిలబస్‌తో పాటు, మధ్యాహ్నం ప్రతిరోజు కాలేజీ స్థాయి లెక్చరర్లతో శిక్షణ ఇప్పించడం వల్లే ఇలాంటి ఉన్నతమైన ర్యాంకులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.

అందుకే తల్లిదండ్రులు స్కూలు స్థాయిలోనే త్వరపడాలని పిలుపునిచ్చారు. జాతీయ స్థాయిలో అద్భుత ర్యాంకులు సాధించిన విద్యార్థులను డైరెక్టర్ సి.హెచ్. తేజస్విని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ అద్భుతమైన ఫలితాలు వేరే ఏ జిల్లాలోనో, వేరే బ్రాంచ్‌లలోనో సాధించినవి కావు.. కేవలం మన నిజామాబాద్ కాకతీయ విద్యాసంస్థల్లో చదివిన విద్యార్థులు సాధించిన మార్కులు మాత్రమేననే విషయాన్ని జిల్లా తల్లిదండ్రులు గమనించాలని యాజమాన్యం సూచించింది.

ఇది కూడా చదవండి..: Fire Accident | పైపుల ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. భారీగా ఆస్తి నష్టం

TAGGED:AIR Rankerseducation news IndiaIIT AspirantsIIT CoachingJEE Advanced 2026JEE Advanced ResultsKakatiya AcademyNizamabad Education
ByNaresh Chandan
Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Previous Article OYO IPO Approval OYO IPO Approval | ఐపీవోకు ‘ఓయో’.. గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సెబీ
Next Article Gold Price Today Gold Price Today | స్థిరంగా పసిడి.. స్వల్పంగా తగ్గిన వెండి!
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Your Trusted Source for Accurate and Timely Updates!

Our commitment to accuracy, impartiality, and delivering breaking news as it happens has earned us the trust of a vast audience. Stay ahead with real-time updates on the latest events, trends.
FacebookLike
XFollow
InstagramFollow
LinkedInFollow
MediumFollow
QuoraFollow
- Advertisement -
Ad image

You Might Also Like

Illegal Cattle Transport |
నిజామాబాద్

Illegal Cattle Transport | పశువుల అక్రమ రవాణా నిరోధానికి పకడ్బందీ చర్యలు..

By Shashi kiran Mottala
Cricket Selections Nizamabad |
నిజామాబాద్

Cricket Selections Nizamabad | జిల్లాస్థాయి అండర్-16, అండర్-19 క్రికెట్ ఎంపికలు పూర్తి

By Shashi kiran Mottala
Nizamabad ROB Projects
నిజామాబాద్

Nizamabad ROB Projects | ఫలించిన ఎంపీ అర్వింద్​ కృషి.. జిల్లాలో మరో రెండు ఆర్వోబీలకు కేంద్రం గ్రీన్​ సిగ్నల్​

By Shashi kiran Mottala
Kamareddy Fuel Shortage
నిజామాబాద్

Kamareddy Fuel Shortage | కామారెడ్డిలో కొనసాగుతున్న పెట్రోల్, డీజిల్ కష్టాలు

By Shashi kiran Mottala
Akshara Today
Facebook Youtube Instagram X-twitter

About US

అక్షర టుడే – తాజా తెలుగు వార్తలు, బ్రేకింగ్ న్యూస్..

తెలంగాణ,, ఆంధ్రప్రదేశ్తో పాటు జాతీయం, అంతర్జాతీయానికి సంబంధించిన తాజా తెలుగు వార్తలు, రాజకీయాలు, సినిమా, క్రీడలు మరియు ముఖ్యమైన విశేషాలను ‘అక్షరటుడే’లో చదవండి.

.

Top Links
  • About Us
  • Contact Us
  • Advertise With Us
Usefull Links
  • Disclaimer
  • Privacy Policy
  • Corrections Policy
  • Terms and Conditions

© Akshara Today 2026. All Rights Reserved.