Madhu Yashki Wife Accident | అమెరికాలో కారు ప్రమాదం.. మాజీ ఎంపీ మధుయాష్కీ సతీమణికి గాయాలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Madhu Yashki Wife Accident | నిజామాబాద్​ (Nizamabad) మాజీ ఎంపీ, కాంగ్రెస్​ సీనియర్​ నాయకుడు మధుయాష్కీ గౌడ్ సతీమణి కారు అమెరికాలో ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలు అయ్యాయి.

Madhu Yashki Wife Accident | పల్టీలు కొట్టిన కారు

కుమార్తె డాక్టర్ గగన యాష్కీని ఎండీ కోర్సు (MD Course)లో జాయిన్ చేసి తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో మధుయాష్కీ భార్య సీనియర్ డాక్టర్ సుచి యాష్కీకి రిబ్స్ విరిగినట్లు వైద్యులు వెల్లడించారు. బోస్టన్ నుంచి న్యూయార్క్‌కు వస్తుండగా వర్షం కారణంగా కారు అదుపుతప్పి పల్టీలు కొట్టింది. లగేజీ ఎక్కువగా ఉండటంతో మధుయాష్కీగౌడ్‌, సుచి యాష్కీ వేర్వేరు కార్లలో ప్రయాణం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. కాగా వారు రేపు ఇండియాకు తిరిగి రావాల్సి ఉండగా ప్రమాదం చోటు చేసుకుంది.

దీనిని కూడా చదవండి : KTR Padayatra | ‘కారు’ గేరు ఎప్పుడు మార్చాలో తెలుసు.. వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తా : కేటీఆర్​

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *