Trump Warning | ఇరాన్​పై దాడులు చేస్తాం.. మరోసారి ట్రంప్​ వార్నింగ్​

Srinivas Kolluri
US Iran Conflict | యుద్ధం ముగిసినట్లే.. ట్రంప్​ కీలక ప్రకటన!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Trump Warning | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్​ ట్రంప్ (Donald Trump)​ మరోసారి ఇరాన్​కు వార్నింగ్​ ఇచ్చారు. అమెరికా, ఇరాన్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం బుధవారంతో ముగియనుంది. ఆ లోపు ఒప్పందం కుదరకపోతే దాడులు పున: ప్రారంభిస్తామని పేర్కొన్నారు.

అమెరికా, ఇరాన్​ మధ్య రెండు వారాల సీజ్​ఫైర్​ (Cease Fire) రేపటితో ముగియనుంది. నేడు పాకిస్థాన్​లో వాషింగ్టన్​, టెహ్రాన్​ మధ్య చర్చలు జరగాల్సి ఉంది. అయితే ఇరాన్​ చర్చలకు ఆసక్తి కనబరచడం లేదు. ఈ క్రమంలో కాల్పుల విరమణను పొడిగించే అంశంపై ట్రంప్​ మాట్లాడుతూ.. తనకు అలా చేయాలని లేదన్నారు. మనకు అంత సమయం లేదని పేర్కొన్నారు.

Trump Warning | చర్చలపై విశ్వాసం

పాకిస్థాన్‌ (Pakistan)లో ఇరాన్‌తో చర్చలు ముందుకు సాగుతాయని వాషింగ్టన్ అధికారులు భావిస్తున్నారు. చర్చలలో చేరడాన్ని టెహ్రాన్ (Tehran) పరిశీలిస్తోందని ఒక సీనియర్ ఇరాన్ అధికారి తెలిపారు. చివరి ప్రయత్నంగా జరిపే తదుపరి శాంతి చర్చల అవకాశాలు ఇంకా అనిశ్చితంగా ఉన్న నేపథ్యంలో, టెహ్రాన్‌తో త్వరలో ఒప్పందం కుదరకపోతే అమెరికా ఇరాన్‌పై దాడులను పునఃప్రారంభిస్తుందని ట్రంప్ హెచ్చరించారు. తాము బాంబు దాడులు చేస్తామన్నారు. ఆ వైఖరితోనే ముందుకు వెళ్లడం మంచిదని భావిస్తున్నట్లు చెప్పారు. దాడులు చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు.

Trump Warning | చర్చలు జరపం

బెదిరింపుల నీడలో, అమెరికా నావికా దిగ్బంధనం కింద గానీ చర్చలు జరపబోమని టెహ్రాన్ చెబుతోంది. ఈ మేరకు రెండో విడత చర్చలకు తమ ప్రతినిధులను పంపడం లేదని పేర్కొంది. మరోవైపు 10 రోజుల కాల్పుల విరమణను ఉల్లంఘిస్తూ, ఇజ్రాయెల్ దక్షిణ లెబనాన్‌పై బాంబుల వర్షం కొనసాగిస్తోంది. మరోవైపు తాము సైతం దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నామని టెహ్రాన్​ పేర్కొంది. కొత్త అస్త్రాలను సిద్ధం చేస్తామని తెలిపింది. దీంతో ఏం జరుగుతుందోనని ఉత్కంఠ నెలకొంది.

us

ఇది కూడా చదవండి : Iran US Tensions | హర్ముజ్​లో మరోసారి ఉద్రిక్తత.. ఇరాన్​ నౌకపై అమెరికా కాల్పులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *