Haridwar Water Tank Snakes | హరిద్వార్‌లో భయంకర దృశ్యం.. వాటర్ ట్యాంకులో ఏకంగా 27 పాములు

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Haridwar Water Tank Snakes | ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్‌లో ( Haridwar )  ఒక కుటుంబం ఊహించని షాక్‌కు గురైంది. ఇంట్లోని అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంకును శుభ్రం చేద్దామని మూత తీయగా, లోపల భారీ సంఖ్యలో పాములు కనిపించాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Haridwar Water Tank Snakes | పాములను చూసి షాక్..

హరిద్వార్‌లోని సరాయ్ గ్రామానికి చెందిన ఓ కుటుంబం, తమ అండర్‌గ్రౌండ్ వాటర్ ట్యాంకును పరిశీలించగా లోపల నీటిలో కదలికలు గమనించారు. లోపలికి తీక్షణంగా చూడగా, ఒకదానిపై ఒకటి మెలికలు తిరుగుతున్న అనేక పాము పిల్లలను చూసి వారు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అప్రమత్తమైన ఆ కుటుంబ సభ్యులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. విషయం తెలిసి గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

Haridwar Water Tank Snakes | బయటకు తీసిన అధికారులు..

సమాచారం అందుకున్న అటవీ శాఖ సిబ్బంది, స్నేక్ క్యాచర్లు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. చాకచక్యంగా వ్యవహరించి, ట్యాంకు నుంచి మొత్తం 27 పాము పిల్లలను బయటకు తీశారు. అనంతరం వాటిని సమీపంలోని సురక్షిత అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Haridwar Water Tank Snakes | ఆసియాటిక్ వాటర్ స్నేక్స్..

ట్యాంకులో దొరికినవి ‘ఆసియాటిక్ వాటర్ స్నేక్’ జాతికి చెందినవని, ఇవి భారతదేశంలో సాధారణంగా కనిపించే నీటి పాములని స్నేక్ క్యాచర్లు వివరించారు. వానాకాలం, ఉక్కబోత కారణంగా చల్లదనం, ఆశ్రయం వెతుక్కుంటూ ఇవి ఇలా ఇళ్లలోకి, వాటర్ ట్యాంకుల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు పేర్కొన్నారు. వర్షాకాలంలో ప్రజలు తమ ఇళ్ల పరిసరాల విషయంలో మరింత అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు.

ఇది కూడా చదవండి:  Telangana Paddy Procurement | ధాన్యం సేకరణలో సరికొత్త రికార్డు: మంత్రి ఉత్తమ్

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *