Water Bell | ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. పాఠశాలల్లో వాటర్​బెల్​

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Water Bell | దేశవ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అల్లాడుతున్నారు. ఈ క్రమంలో ఢిల్లీ ప్రభుత్వం (Delhi Government) కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు ఎక్కువగా నీరు తాగించేలా బడుల్లో ప్రతి గంటకు ‘వాటర్ బెల్’ మోగించాలని ఆదేశించింది.

దేశ రాజధానిలో ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు చేపట్టింది. దీంతో పిల్లలను సురక్షితంగా ఉంచడానికి పాఠశాలలు ఇప్పుడు తక్షణ చర్యలను అమలు చేస్తున్నాయి. పిల్లలలో డీహైడ్రేషన్ (Dehydration), వేడి సంబంధిత అనారోగ్యాలను నివారించే లక్ష్యంతో ముందుజాగ్రత్త చర్యలను అమలు చేయాలని అన్ని ప్రభుత్వ, ఎయిడెడ్ మరియు ప్రైవేట్ గుర్తింపు పొందిన పాఠశాలలను అధికారులు ఆదేశించారు.

Water Bell

Water Bell | నీరు ఎక్కువగా తాగాలి

బడిలో విద్యార్థులు (Students) నీరు తక్కువగా తాగుతారు. దీంతో వేసవిలో డీహైడ్రేషన్​కు గురయ్యే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో విద్యార్థులకు నీరు తాగాలని గుర్తు చేయడానికి పాఠశాలలు ప్రతి 45 నుంచి 60 నిమిషాలకు ఒకసారి గంట మోగించాలి. ఈ “వాటర్ బెల్” వ్యవస్థ తీవ్రమైన వేడి సమయంలో క్రమం తప్పకుండా నీరు అందేలా చూసేందుకు రూపొందించారు. బడుల్లో ఉదయం పూట అసెంబ్లీలను రద్దు చేయడం చేశారు. తీవ్రమైన వేడి సమయంలో బహిరంగ తరగతులను నివారించాలని, బహిరంగ శారీరక కార్యకలాపాలను నిలిపివేయాలని కూడా పాఠశాలలకు ప్రభుత్వం సూచించింది. పాఠశాల ప్రాంగణంలో సురక్షితమైన, చల్లని తాగునీటిని అందించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి..: Bengaluru Murder Case | ప్రపోజ్​ చేస్తానని ప్రాణం తీసిన ప్రియురాలు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *