Xiaomi 17T | షావోమీ నుంచి మిడ్‌రేంజ్ ఫోన్.. ఆ కార్డులపై 5 వేల డిస్కౌంట్!

షావోమీ కంపెనీ మిడ్‌రేంజ్ లో 17టీ పేరుతో మరో మోడల్ స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో విడుదల చేసింది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Xiaomi 17T | చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ షావోమీ భారత్‌లో మరో స్మార్ట్ ఫోన్ మోడల్‌ను రిలీజ్ చేసింది. షావోమీ 17టీ పేరుతో వచ్చిన ఈ ఫోన్ .. శక్తిమంతమైన ప్రాసెసర్, లైకా భాగస్వామ్యంతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. అమెజాన్ (Amazon) తోపాటు షావోమీ వెబ్‌సైట్, రిటైల్ స్టోర్‌లలోనూ బుధవారం (ఈనెల 10) నుంచి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకతలు తెలుసుకుందామా..

Xiaomi 17T | డిస్‌ప్లే..

6.59 అంగుళాల 1.5 కే అమోలెడ్ డిస్‌ప్లే అమర్చారు. ఇది 120హెచ్ జెడ్ రిఫ్రెష్ రేటు, 3500 నిట్స్ పీక్‌ బ్రైట్‌నెస్ కలిగి ఉంది. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్‌తో వస్తోంది. ఐపీ68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ సర్టిఫికెట్ ఉంది.

ప్రాసెసర్ : మీడియాటెక్ డైమెన్సిటీ 8500 అల్ట్రా ప్రాసెసర్ తో వచ్చిన ఈ ఫోన్.. ఆండ్రాయిడ్ 16 ఆధారిత హైపరఓఎస్ 3తో పనిచేస్తుంది.

కెమెరా సెటప్ : వెనక వైపు 50 ఎంపీ లైట్ ప్యూజియన్ 800 ప్రధాన కెమెరా, 50 ఎంపీ పెరిస్కోప్ టెలిఫొటో కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 32 ఎంపీ కెమెరా ఇచ్చారు.

Xiaomi 17T | బ్యాటరీ సామర్థ్యం..

6,500 ఎంఏహెచ్ సిలికాన్ కార్బన్ బ్యాటరీ అమర్చారు. ఇది 67 డబ్ల్యూ ఫాస్ట్ చార్జింగ్ ను, 22.5డబ్ల్యూ రివర్స్ చార్జింగ్ ను సపోర్ట్ చేస్తుంది.
1,600 చార్జింగ్ సైకిళ్ల తర్వాత కూడా బ్యాటరీ 80 శాతం సామర్థ్యంతో పనిచేస్తుందని కంపెనీ చెబుతోంది.

వేరియంట్స్ : వయోలెట్, బ్లూ, బ్లాక్ రంగుల్లో రెండు వేరియంట్లలో లభిస్తుంది.
12జీబీ, 256జీబీ వేరియంట్ ధర రూ.59,999.
12జీబీ, 512జీబీ వేరియంట్ ధర రూ.64,999.

ఆఫర్లు : పరిచయ ఆఫర్ కింద హెచ్‌డీఎఫ్‌సీ, ఎస్‌బీఐ, యాక్సిస్, బ్యాంకు ఆఫ్ బరోడా, కొటక్ కార్డు హోల్డర్స్‌కు రూ.5 వేల వరకు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ బోనస్ కింద రూ.5 వేల వరకు ఆఫర్ ఉంది.
ఏడాదిలోపు 60 శాతం వరకు బైబ్యాక్‌ను ఆఫర్ చేస్తోంది.
నాలుగు నెలల స్పాటీఫై ప్రీమియం, మూడు నెలలపాటు జియో హాట్‌స్టార్, మూడు నెలల యూట్యూబ్ ప్రీమియం, గూగుల్ ఏఐ ప్రో సదుపాయాలను ఉచితంగా అందిస్తోంది.

ఇది కూడా చదవండి..: TCS Market Value | క్షీణిస్తున్న టీసీఎస్ విలువ.. 21 నెలల్లో సగమైన మార్కెట్ క్యాప్

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *