Telangana Orange Alert | భారీ వర్షాల హెచ్చరిక.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ

వాతావరణ పరిస్థితులను ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న అధికారులు, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Telangana Orange Alert | హైదరాబాద్‌లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తుండగా, తెలంగాణలోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (IMD) ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది.

Telangana Orange Alert | ఈదురుగాలులు..

మేడ్చల్-మల్కాజిగిరి, మహబూబాబాద్, నిజామాబాద్, రంగారెడ్డి, వరంగల్, యాదాద్రి భువనగిరి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించిన IMD, రాత్రి 11:24 గంటల వరకు వర్షాలు కొనసాగే అవకాశముందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది.

అదేవిధంగా రాష్ట్రంలోని మిగతా జిల్లాలకు కూడా వర్ష సూచనలు ఉన్న నేపథ్యంలో ఎల్లో అలర్ట్ జారీ చేసింది. వర్షాలు, బలమైన గాలుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.

Revanth Reddy Flight Diversion | Rain effect.. సీఎం రేవంత్ రెడ్డి ప్రయాణిస్తున్న విమానం బెంగళూరుకు మళ్లింపు

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *