Ali Khamenei Funeral | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్ ఖరారు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Ali Khamenei Funeral | ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియల షెడ్యూల్‌ను ఆ దేశ అధికారులు అధికారికంగా ప్రకటించారు. జులై 4 నుంచి జులై 9 వ తేదీ వరకు వివిధ దశల్లో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది.

Ali Khamenei Funeral | టెహ్రాన్‌లో అంతిమయాత్ర

అధికారిక కార్యక్రమాలు జులై 4న రాజధాని టెహ్రాన్‌లో ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు ప్రజల సందర్శన కోసం ఖమేనీ భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం జులై 6న టెహ్రాన్‌లో అంతిమయాత్ర నిర్వహించనుండగా, జులై 7న పవిత్ర నగరం కోమ్‌లో ప్రత్యేక ప్రార్థనలు, స్మారక కార్యక్రమాలు చేపట్టనున్నారు.

చివరి దశలో జులై 9న ఇరాన్‌లోని పవిత్ర నగరం మష్హద్‌లో ఉన్న ఇమామ్ రెజా ష్రైన్ వద్ద ఖమేనీకి అంతిమ ఖననం జరగనుంది. ఈ ప్రదేశం షియా ముస్లింలకు అత్యంత పవిత్రమైన క్షేత్రాల్లో ఒకటిగా గుర్తింపు పొందింది.

Ali Khamenei Funeral | పలుమార్లు వాయిదా

ఫిబ్రవరి 28న ఇరాన్‌పై జరిగిన అమెరికా-ఇజ్రాయెల్ వైమానిక దాడుల తొలి దశలో ఖమేనీ మరణించారు. యుద్ధ పరిస్థితులు, భద్రతా కారణాలు మరియు భారీ స్థాయిలో ఏర్పాట్లు అవసరమవడంతో అంత్యక్రియలు పలుమార్లు వాయిదా పడ్డాయి. దీంతో ఆయన మరణించిన నాలుగు నెలల తర్వాత అంత్యక్రియల కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది.

సుమారు 37 సంవత్సరాల పాటు ఇరాన్‌కు సుప్రీం లీడర్‌గా సేవలందించిన ఖమేనీ మరణం దేశ రాజకీయ, మతపరమైన చరిత్రలో కీలక ఘట్టంగా భావిస్తున్నారు. అంత్యక్రియలకు లక్షలాది మంది హాజరయ్యే అవకాశం ఉందని ఇరాన్ మీడియా అంచనా వేస్తోంది.

Jaishankar Russia Oil | మీరు అమ్మే ఆయుధాలతోనే భారత్‌పై దాడి: యూరప్‌ను నిలదీసిన జైశంకర్

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *