BRICS Summit | బ్రిక్స్​ సదస్సుపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడి కీలక వ్యాఖ్యలు

బ్రిక్స్​ సదస్సును అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు భారత్​కు దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అభినందనలు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : BRICS Summit | బ్రిక్స్​ సదస్సును అత్యంత విజయవంతంగా నిర్వహించినందుకు భారత్​కు దక్షిణాఫ్రికా (South Africa) అధ్యక్షుడు సిరిల్ రామఫోసా అభినందనలు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సదస్సులో ఉమ్మడి ప్రకటనను విజయవంతంగా ఆమోదించినట్లు పేర్కొన్నారు.

బ్రిక్స్​ సదస్సు ఏర్పాట్లు బాగా ఉన్నాయని రామఫోసా అన్నారు. 30 నగరాల్లో దాదాపు 350 సమావేశాలను నిర్వహించడంలో అద్భుతమైన నాయకత్వాన్ని అందించారని కొనియాడారు. శిఖరాగ్ర సమావేశాలు జరిగినప్పుడు పొరపాట్లు జరుగుతాయని, అయితే భారత్​ మాత్రం ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించిందన్నారు. అన్ని దేశాలు సహకరించుకుని ఏకాభిప్రాయానికి రావాల్సి ఉన్నప్పటికీ, వారికి ఒక కేంద్ర బిందువు అవసరం అని ఆయన అన్నారు. ఆ మార్గదర్శక శక్తిగా భారత్ నిలిచిందన్నారు.

BRICS Summit | గాంధీ–మండేలా స్కాలర్​షిప్​

ప్రధాని మోదీ (PM Modi)తో జరిగిన ద్వైపాక్షిక చర్చల గురించి ఆయన వివరించారు. దక్షిణాఫ్రికా– భారత్​ మధ్య ఉన్న ఈ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కలిసి జరుపుకునేందుకు వచ్చే ఏడాది దక్షిణాఫ్రికాకు రావాల్సిందిగా మోదీని ఆహ్వానించినట్లు చెప్పారు. వీలైతే నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా రావాలని కోరినట్లు తెలిపారు. అలాగే గాంధీ-మండేలా స్కాలర్‌షిప్ గురించి కూడా తాము చర్చించామన్నారు. సాంకేతిక పరంగా భారత్​ ముందడుగు వేస్తోందన్నారు.

దీనిని కూడా చదవండి : Rahul Gandhi Comments | బ్రిక్స్ విందు మెనూపై రాహుల్ గాంధీ విమర్శలు.. ఘాటుగా బదులిచ్చిన కేంద్ర మంత్రి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *