Bandi Sanjay Remarks | అక్రమ వలసదారుల ఓట్లపై కాంగ్రెస్ మౌనం ఎందుకు?: బండి సంజయ్

తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Bandi Sanjay Remarks | తెలంగాణ అభివృద్ధి విషయంలో కేంద్రం చిత్తశుద్ధితో ఉందని, రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునే ప్రసక్తే లేదని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ( Bandi Sanjay ) కుమార్ స్పష్టం చేశారు. మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూరులో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర రాజకీయాలపై, కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసారు.

Bandi Sanjay Remarks | ఆ నిధులు ఎటు పోయాయి?

గత 12 సంవత్సరాలుగా తెలంగాణ అభివృద్ధి, సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం ఏకంగా రూ. 10 లక్షల కోట్లు కేటాయించిందని బండి సంజయ్ తెలిపారు. హైదరాబాద్, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన కార్పొరేషన్ల అభివృద్ధికి వేల కోట్ల రూపాయలను కేంద్రం మంజూరు చేసిందని గుర్తు చేశారు. అయితే, కేంద్రం ఇచ్చిన నిధులు ఏమయ్యాయని, అవి ఏ విధంగా ఖర్చయ్యాయో రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలని ఆయన నిలదీశారు. తెలంగాణ మరింత వేగంగా అభివృద్ధి చెందాలంటే రాష్ట్రంలో ‘డబుల్ ఇంజన్ సర్కార్’ రావాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.
bandisanjay.1 1

 

Bandi Sanjay Remarks | కాంగ్రెస్ తీరుపై నిప్పులు..

దేశంలోకి అక్రమంగా చొరబడిన వలసదారుల ఓట్ల తొలగింపు విషయంలో కాంగ్రెస్ ఎందుకు మౌనంగా ఉందని బండి సంజయ్ ప్రశ్నించారు. ముస్లిం సమాజాన్ని అక్రమ వలసదారులతో పోల్చడం ద్వారా కాంగ్రెస్ పార్టీ వారిని అవమానిస్తోందని, ఇందుకు ఆ పార్టీ వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

Bandi Sanjay Remarks | మావోయిజంపై ధ్వజం..

సమాజంలో మావోయిస్టు భావజాలం వల్ల నష్టం జరుగుతోందని, తుపాకీ సంస్కృతితో ఏదీ సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు. మైనర్ పిల్లల చేతుల్లో తుపాకులు పెట్టడం దారుణమని, ఇంకా ఆ ఆలోచనలో ఉన్నవారు లొంగిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలని పిలుపునిచ్చారు.

Bandi Sanjay Remarks| యువత, రైతుల సంక్షేమమే లక్ష్యం..

ప్రధాని మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం యువతకు, రైతులకు పెద్దపీట వేస్తోందని సంజయ్ అన్నారు. ప్రధానమంత్రి రోజ్‌గార్ మేళా ద్వారా కేవలం 18 నెలల్లోనే 12 లక్షల ఉద్యోగాలను కల్పించామన్నారు. ‘స్టార్టప్ ఇండియా’ ద్వారా 23 లక్షల మందికి ఉపాధి లభించిందని తెలిపారు. ‘కిసాన్ సమ్మాన్ నిధి’, పెంచిన కనీస మద్దతు ధర (MSP) ద్వారా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేయడమే లక్ష్యమని చెప్పారు. విదేశీ వస్తువులను బహిష్కరించి, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం ద్వారా భారత్‌ను ఎగుమతి చేసే స్థాయికి తీసుకెళ్లడమే తమ ఆకాంక్ష అని బండి సంజయ్ పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: Land Survey Deputy Director | భూ సర్వే శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఇంట్లో నోట్ల కట్టలు..

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *