Hyderabad Metro Phase 2 | మెట్రో – 2 కు నిధుల విడుదలలో జాప్యం సీఎం అసంతృప్తి.. కేంద్ర మంత్రి కిషన్​ రెడ్డికి బహిరంగ లేఖ!

ఐఆర్‌ఎఫ్‌సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వీలైనంత తొందరగా మంజూరు చేయాలని కిషన్ రెడ్డి ని కోరారు.

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Hyderabad Metro Phase 2 | హైదరాబాద్ మెట్రో ఫేజ్-II విస్తరణ చేపట్టడానికి, మెట్రో ఫేజ్ -I స్వాధీనం కోసం తెలంగాణ ప్రభుత్వం ముందస్తు షరతులన్నింటినీ పూర్తి చేసినట్లు సీఎం రేవంత్​ రెడ్డి పేర్కొన్నారు.

ఈ మేరకు ఈ అంశాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి AshwiniVaishnaw దృష్టికి తీసుకెళ్లి, ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి నిధులు ఇప్పించాలని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి kishan reddy ని ముఖ్యమంత్రి కోరారు. ఈ మేరకు ముఖ్యమంత్రి బహిరంగ లేఖ రాశారు.

Hyderabad Metro Phase 2 | రుసుముగా రూ. 84.32 కోట్ల చెల్లింపు

మెట్రో స్వాధీనం కోసం అమలులో ఉన్న ఆర్థిక ఒప్పందాల ప్రకారం, IRFC అంగీకరించిన మేరకు తొలి విడత రుణాన్ని జూన్ 15, 2026 న విడుదల చేయాల్సి ఉందని, అందుకోసం ప్రభుత్వం ముందస్తు షరతులను పూర్తి చేయడమే కాకుండా ఐఆర్‌ఎఫ్‌సీ కోరిన మేరకు ముందస్తు రుసుముగా రూ. 84.32 కోట్ల చెల్లించినట్టు ముఖ్యమంత్రి ఆ లేఖలో వివరించారు.

ఒప్పంద ప్రక్రియ మేరకు అన్నింటినీ పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు ఐఆర్‌ఎఫ్‌సీ నుంచి నిధులు విడుదల కాలేదని లేఖలో కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు.

akshara today .jpgletter

Hyderabad Metro Phase 2 | మెట్రో రైల్ ఫేజ్ -2 విస్తరణ

మెట్రో స్వాధీన ప్రక్రియ, సంతకాలు చేసిన ఒప్పందం, ప్రతిపాదిత హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ -2 విస్తరణకు సంబంధించి ఇంకా ఏవైనా సమాచారం కావలసినా, వివరణలు అవసరమైనా, సంబంధిత అధికారులతో కలిసి అనుకూలమైన సమయం, ప్రదేశంలో వ్యక్తిగతంగా కలిసి అన్ని వివరాలు అందించడానికి సిద్ధంగా ఉన్నట్టు ముఖ్యమంత్రి ఆ లేఖలో స్పష్టం చేశారు.

ఐఆర్‌ఎఫ్‌సీ మంజూరు చేసిన రుణం మరింత జాప్యం జరక్కుండా వెంటనే విడుదల చేయించడంతో పాటు హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్-2 ప్రాజెక్టుకు అవసరమైన అన్ని అనుమతులను వీలైనంత తొందరగా మంజూరు చేయాలని కిషన్ రెడ్డి ని కోరారు.

Hyderabad Metro Phase 2 | సమావేశాన్ని ఏర్పాటు చేయండి

“అత్యంత ప్రాధాన్యం కలిగిన ఈ అంశం పరిష్కారానికి సంబంధించి జరిగే ఏ సమావేశానికైనా నేను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాను. కేంద్ర రైల్వే శాఖ మంత్రి AshwiniVaishnaw తో వీలైనంత త్వరగా ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయండి. ఆ సమావేశానికి సంబంధిత ఒప్పందాలు, ఆధార పత్రాలతో హాజరై, ఏవైనా సందేహాలు, సమస్యలను నివృత్తి చేసి, ఈ అంశాన్ని త్వరితగతిన పరిష్కరించేలా సహకరిస్తాను..” అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

మెట్రో రైలు ఫేజ్ -1 అంశాలతో పాటు ఫేజ్ -2 లో భాగంగా నగరంలో ఏడు కారిడార్లను కవర్ చేస్తూ సుమారు రూ. 38,595 కోట్ల అంచనా వ్యయంతో 122.9 కి.మీ మేరకు విస్తరణ చేపట్టాల్సిన మెట్రో ఫేజ్-2 వివరాలను ముఖ్యమంత్రి రాసిన ఏడు పేజీల లేఖలో సమగ్రంగా వివరించారు.

Phule Ambedkar Ideology | మేధో సంపత్తి గులాంగిరి ఇంకెన్నాళ్లు..? బ్లూ ప్రింట్​ ఇదిగో.. రండి.. బహుజన రాజ్యాధికారం చేజిక్కించుకుందాం!

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *