Rahul Gandhi NEET | పేపర్ లీకేజీని ఆపలేక యాప్‌లపై నిషేధమా?: రాహుల్ గాంధీ

నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించడంపై రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Rahul Gandhi NEET | నీట్ పరీక్ష నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్‌పై కేంద్రం తాత్కాలిక నిషేధం విధించడంపై రాహుల్ గాంధీ ( Rahul Gandhi )ఘాటుగా స్పందించారు. ఇది దొంగను పట్టుకోవడానికి బదులుగా, బాధితుడి ఇంటికి తాళం వేయడం వంటిదని ఆయన ఎద్దేవా చేశారు. అసలు సమస్యను వదిలేసి, ప్రభుత్వం ఇటువంటి పనికిరాని చర్యలు తీసుకుంటోందని ఆయన ఆరోపించారు.

Rahul Gandhi NEET |నాటకాలు ఆపాలి..

ప్రభుత్వం ఇలాంటి నాటకాలు కట్టిపెట్టి, ముందుగా పేపర్ లీకేజీకి పాల్పడుతున్న మాఫియాను దెబ్బతీయాలని డిమాండ్ చేశారు. లీకేజీ నెట్‌వర్క్‌లను పట్టుకోకుండా, విద్యార్థులు చదువు కోసం, నోట్స్ కోసం ఆధారపడే టెలిగ్రామ్ వంటి వేదికలపై ఆంక్షలు విధించడం సరికాదని అన్నారు. “తర్వాత వాట్సాప్‌ను కూడా నిషేధిస్తారా?” అని ప్రభుత్వాన్ని నిలదీశారు. క్వశ్చన్ పేపర్లను విమానాల్లో పంపడం, విద్యార్థులపై కఠిన తనిఖీలు చేయడం వల్ల సమస్య పరిష్కారం కాదని, అసలు లీకేజీకి కారణమైన వ్యవస్థను నిర్మూలించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.
rahul.1 1

Rahul Gandhi NEET |యువత ఆగ్రహం తప్పదు..

ప్రభుత్వం విద్యార్థుల గొంతును వినకుండా, కేవలం భద్రత పేరుతో ఇలాంటి చర్యలు తీసుకుంటే యువతలో ఆగ్రహం కట్టలు తెంచుకుంటుందని రాహుల్ గాంధీ హెచ్చరించారు. పేపర్ లీకేజీ మాఫియాకు ప్రభుత్వం భయపడుతోందని, విద్యార్థుల ప్రయోజనాలను పక్కన పెడుతోందని ఆయన విమర్శించారు.

ఇది కూడా చదవండి:  Mulugu IT Company | ములుగు జిల్లాలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభం

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *