అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Tesla Experience Center | హైదరాబాద్ (Hyderbad) IT హబ్‌లో టెస్లా సరికొత్త ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం అయింది. 2026 మోడల్ Y ప్రీమియం RWD, మోడల్ Y వాహనాలను ప్రదర్శనకు ఉంచింది. హైదరాబాద్ వేదికగా టెస్లా నెక్స్ట్ జనరేషన్ ఈవీ కార్ల విజువల్స్‌ను ఇండియా హెడ్ శరద్ అగర్వాల్ పంచుకున్నారు.
ఈ సెంటర్లో టెస్లా కార్లను దగ్గరగా చూసే అవకాశం, వాటి ఫీచర్లు తెలుసుకునే అవకాశం ఉంది. మాదాపూర్ (Madhapur)లో ఏర్పాటు చేసిన ఈ ఎక్స్పీరియన్స్ సెంటర్ దేశంలో ఐదోది. ఈ కొత్త సెంటర్లో 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్, మోడల్ వై ఎల్ కార్లను జూన్ 17 నుంచి ప్రదర్శనకు ఉంచారు. ఇక్కడికి వచ్చే సందర్శకులు టెస్లా అడ్వైజర్లు మార్గనిర్దేశం చేస్తారు. అలాగే కార్లను దగ్గరగా అనుభవించే ఇమర్సివ్ ప్రొడక్ట్ అనుభవాలు కూడా పొందవచ్చు.

Tesla Experience Center | జులై నుంచి డెలివరీలు
టెస్లా ఢిల్లీ, ముంబై, గురుగ్రామ్, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో ఎక్స్పీరియన్స్ సెంటర్లను నిర్వహిస్తోంది. కొత్తగా వచ్చిన 2026 మోడల్ వై ప్రీమియం రియర్-వీల్ డ్రైవ్ కారులో 2,138 లీటర్ల స్టోరేజ్ స్థలం ఉంది. ఇందులో ఐదుగురు కూర్చోవచ్చు. ఈ కారు 5.9 సెకన్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. దీని ధర రూ.50.89 లక్షలు. కారు డెలివరీలు జులై నుంచి మొదలవుతాయి.
దీనిని కూడా చదవండి : Etela Rajender Cantonment | కంచే చేను మేసినట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది : ఈటల రాజేందర్