UAE Social Media | 15 ఏళ్లు నిండితేనే సోషల్‌ మీడియా ఖాతాలు.. యూఏఈ సంచలన నిర్ణయం

సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల పిల్లలపై పెరుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: UAE Social Media | సామాజిక మాధ్యమాల వినియోగం వల్ల పిల్లలపై పెరుగుతున్న దుష్ప్రభావాలను అరికట్టేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై సోషల్ మీడియా వేదికలను వినియోగించుకోవాలంటే కనీసం 15 సంవత్సరాలు నిండి ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మేరకు గురువారం అధికారిక తీర్మానాన్ని ఆమోదించింది. సోషల్ మీడియాపై వయోపరిమితి ఆంక్షలు విధించిన తొలి అరబ్ దేశంగా యూఏఈ నిలిచింది.

UAE Social Media | ఖాతాలపై ఆంక్షలు..

5 సంవత్సరాలలోపు వయసున్న చిన్నారులు సోషల్ మీడియాలో వ్యక్తిగత ఖాతాలు సృష్టించుకోవడం ఇక సాధ్యం కాదు. వయసుకి తగని కంటెంట్ (Age-appropriate content), స్క్రీన్ టైమ్ నియంత్రణలు, , పిల్లలను ఆకర్షించే ఫీచర్లపై ప్లాట్‌ఫామ్‌లు ఆంక్షలు విధించాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ మార్పులను తమ యాప్స్‌లో అమలు చేయడానికి సోషల్ మీడియా కంపెనీలకు 12 నెలల సమయాన్ని కేటాయించారు.

UAE Social Media | నిబంధనల ముఖ్య ఉద్దేశం..

యూఏఈలో పిల్లలు రోజుకు సగటున 3 గంటలకు పైగా సోషల్ మీడియాలోనే గడుపుతున్నారని ఇటీవల సర్వేలు వెల్లడించాయి. చిన్నారుల మానసిక ఆరోగ్యాన్ని కాపాడటం, వారిని ప్రమాదకరమైన కంటెంట్‌కు దూరంగా ఉంచడం ద్వారా ఆరోగ్యకరమైన డిజిటల్ వాతావరణాన్ని అందించడమే ఈ నిబంధనల వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. ఇప్పటికే ఆస్ట్రేలియా, యూకే , మలేసియా వంటి దేశాలు ఇలాంటి కఠిన నిబంధనలను అమలు చేస్తున్నాయి.

ఇది కూడా చదవండి: Rayadurgam Land Auction | రాయదుర్గం భూముల వివాదం.. వేలం ప్రక్రియపై హైకోర్టు స్టే

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *