అక్షరటుడే, వెబ్‌డెస్క్: Telegram Ban Petition | నీట్ యూజీ పరీక్ష (NEET UG exam) ఈ నెల 21 జరగనున్న విషయం తెలిసిందే. పరీక్ష నేపథ్యంలో పేపర్ లీకేజీని అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్‌పై తాత్కాలిక నిషేధం విధించింది.
దీనిపై ఆ సంస్థ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించగా.. అక్కడ చుక్కెదురైంది.నీట్ పునఃపరీక్ష దృష్ట్యా విధించిన తాత్కాలిక నిషేధానికి సంబంధించి ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ, టెలిగ్రామ్‌కు ఉపశమనం కల్పించడానికి ఢిల్లీ హైకోర్టు (Delhi High Court) శుక్రవారం నిరాకరించింది. కేంద్రం అన్ని నిబంధనలు, విధివిధానాలను పాటించిందని, సెక్షన్ 69A ప్రకారం టెలిగ్రామ్‌ను నిరోధించే అధికారం ప్రభుత్వానికి ఉందని కోర్టు పేర్కొంది.
Telegram Ban Petition | ఎన్టీఏ అభ్యర్థన మేరకు
ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలు కనీస ఆంక్షలతో కూడినవని జస్టిస్ తేజస్ కారియా పేర్కొన్నారు. పిటిషనర్ ఆరోపించినట్లుగా ఈ ఉత్తర్వు అసమంజసమని, తాత్కాలిక నిషేధ నిర్ణయం తీసుకునే ముందు తగినంతగా ఆలోచించలేదని చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) అభ్యర్థన మేరకు, కేంద్ర ప్రభుత్వం భారతదేశంలో టెలిగ్రామ్ మెసేజింగ్ యాప్‌ను ఒక వారం పాటు (సోమవారం జూన్ 22 2026 వరకు) నిరోధించాలని నిర్ణయించింది. అభ్యర్థులను మోసం చేయడానికి కొన్ని ముఠాలు ఈ ప్లాట్‌ఫారమ్‌ను వ్యవస్థీకృతంగా వినియోగిస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు NTA తెలిపింది.
ఇది కూడా చదవండి..: Gold Price Drop | పసిడిప్రియులకు ఊరట.. భారీగా తగ్గిన బంగారం ధరలు