Yoga Andhra Event | అమరావతి వేదికగా ‘యోగాంధ్ర’.. చంద్రబాబు విజన్‌ను ప్రశంసించిన బాబా రాందేవ్

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 'యోగాంధ్ర' కార్యక్రమాన్ని నిర్వహించింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Yoga Andhra Event | అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఉండవల్లి గుహల వద్ద రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ‘యోగాంధ్ర’ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ వేడుకకు ముఖ్యమంత్రి చంద్రబాబు ( Chandrababu Naidu ) నాయుడుతో పాటు ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్ ముఖ్య అతిథిగా హాజరై, యోగా ప్రాధాన్యతను చాటిచెప్పారు.

Yoga Andhra Event | సీఎంపై ప్రశంసల జల్లు..

చంద్రబాబు నాయుడు ఈ వయస్సులో కూడా అత్యంత ఆరోగ్యంగా ఉండటం అభినందనీయమని బాబా రాందేవ్ కొనియాడారు. చంద్రబాబుకు అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందని, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యమైన ‘వికసిత్ భారత్’ సాధన దిశగా ఆయన వేగంగా అడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి నాయకత్వం ప్రతి రాష్ట్రంలో ఉంటే, 2047 నాటికి భారత్ అనుకున్న లక్ష్యాలను చేరుకుంటుందని బాబా రాందేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అమరావతిని ‘యోగా రాజధాని’గా అభివర్ణించిన ఆయన, చంద్రబాబును సర్వజన ప్రేమికుడిగా ప్రశంసించారు.

yoga.1

Yoga Andhra Event | యువతకు యోగా అవసరం..

సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. యోగా ద్వారా ప్రపంచవ్యాప్తంగా అద్భుతాలు సృష్టిస్తున్న రాందేవ్ బాబాకు ధన్యవాదాలు తెలిపారు. నేటి యువత తీవ్ర ఒత్తిడిలో ఉందని, దానికి ఆధ్యాత్మికతతో కూడిన సాంకేతికత తోడైతే అద్భుత ఫలితాలు ఉంటాయని సీఎం పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా 190 దేశాలు యోగాను అనుసరిస్తున్నాయని ఆయన గుర్తుచేశారు.

Yoga Andhra Event | ఏపీని ఆధ్యాత్మిక హబ్‌గా మారుస్తాం..

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక హబ్‌గా తీర్చిదిద్దుతామని సీఎం ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్రంలో పచ్చదనాన్ని 50 శాతానికి పెంచేందుకు తమ ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికలతో ముందుకు వెళ్తోందని చంద్రబాబు వెల్లడించారు.

ఇది కూడా చదవండి: Heavy Rain Alert | నేడు భారీ వర్ష సూచన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *