Telangana University Appointments | అధ్యాపకుల నియామకాలు తప్పు పట్టడం తగదు

తెలంగాణ యూనివర్సిటీలో 2012 ఏడాది నోటిఫికేషన్ ద్వారా 2014లో భర్తీ అయిన అధ్యాపకుల నియామకాన్ని తప్పు పట్టడం తగదని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(TUTA) పేర్కొంది.

Shashi kiran Mottala

అక్షరటుడే, తెయూ క్యాంపస్: Telangana University Appointments | తెలంగాణ యూనివర్సిటీలో 2012 ఏడాది నోటిఫికేషన్ ద్వారా 2014లో భర్తీ అయిన అధ్యాపకుల నియామకాన్ని తప్పు పట్టడం తగదని తెలంగాణ యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్(TUTA) పేర్కొంది. యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టూటా అధ్యక్ష, కార్యదర్శులు పున్నయ్య, మోహన్ బాబు మాట్లాడారు.

Telangana University Appointments | తప్పుగా చిత్రీకరిస్తున్నారు..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. ఇటీవల కొందరు వ్యక్తులు చేసిన ఆరోపణలు పూర్తిగా ఏకపక్షమైనవన్నారు. వాస్తవాలను దాచిపెట్టేవి, న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉన్న అంశాన్ని తప్పుగా చిత్రీకరించేలా ఉన్నాయని పేర్కొన్నారు. హైకోర్టు (High Court)లో అప్పీళ్లు పెండింగ్‌లో ఉండగా సింగిల్ జడ్జి తీర్పును అంతిమ తీర్పుగా ప్రచారం చేయడం చట్టవిరుద్ధమని వివరించారు. రిట్ అప్పీల్స్ పెండింగ్‌లో ఉన్నాయని, డివిజన్ బెంచ్ సింగిల్ జడ్జి ఉత్తర్వుపై ఇంటీరిమ్ సస్పెన్షన్ మంజూరు చేసిందన్నారు. ఆ సింగిల్ జడ్జి ఉత్తర్వు అమలులో ఉన్న తుది తీర్పుగా చూపిస్తూ, అధ్యాపకులను ‘అక్రమ నియామకులు’గా ముద్ర వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు.

Telangana University Appointments | కేసు తుది నిర్ణయం రాకముందే..

Telangana University Appointments

సుప్రీంకోర్టు, హై కోర్ట్, బార్ అసోసియేషన్, అలాహాబాద్ ఓ కేసులో స్పష్టంగా పేర్కొన్నది ఏమంటే.. హైకోర్టు ఇచ్చిన ఇంటీరిమ్ స్టే / ఇంటీరిమ్ రిలీఫ్ స్వయంగా కాలపరిమితి ముగిసిందని భావించి రద్దు అయినట్లు చెప్పలేరని అధ్యాపకులు తెలిపారు. అలాంటి ఉత్తర్వు రద్దు కావాలంటే, దానిని రద్దు చేసే స్పష్టమైన న్యాయ ఉత్తర్వు ఉండాలి లేదా ప్రధాన కేసు పరిష్కారమవ్వాలని సూచించారు. కాబట్టి ‘స్టే గడువు ముగిసింది’ అనే ప్రచారం చట్టపరంగా నిలబడదని గమనించాలన్నారు. అలాగే, నియామక ప్రక్రియలో పాల్గొని, ఫలితం అనుకూలంగా రాకపోయిన తర్వాత అదే నియామక ప్రక్రియను సవాలు చేయరాదనే న్యాయ సూత్రాన్ని సుప్రీంకోర్టు అనేక తీర్పుల్లో స్థిరపరిచిందన్నారు. ఈ కీలక న్యాయ అంశాలు ప్రస్తుతం డివిజన్ బెంచ్ ముందు పరిశీలనలో ఉన్నందున కేసు తుది నిర్ణయం రాకముందే, తుది న్యాయస్థితిగా ప్రచారం చేయడం తీవ్ర అభ్యంతరకరమైనదని పేర్కొన్నారు. కోర్టు తుది నిర్ణయం ఇవ్వకముందే ఉద్యోగ భద్రతను దెబ్బతీయడం తగదని, యూనివర్సిటీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం, హైకోర్టు డివిజన్ బెంచ్ ముందు పెండింగ్‌లో ఉన్న రిట్ అప్పీల్స్ తుది నిర్ణయం వచ్చే వరకు చట్ట ప్రకారం మాత్రమే వ్యవహరించాలని కోరారు.

Telangana University Appointments | పదోన్నతులతో సంబంధం లేదు

2014లో నియామకమైన అధ్యాపకులకు పదోన్నతి కల్పించాలని ప్రభుత్వం తేల్చి చెప్పిందన్నారు. పదోన్నతుల ప్రక్రియను కొనసాగించాలని అడ్వకేట్ జనరల్ తన లీగల్ ఒపీనియన్​లో పేర్కొన్నారని, 2025 జనవరి 4న జరిగిన ఈసీ పదోన్నతి ప్రక్రియను పూర్తి చేయాలని తీర్మానించిందన్నారు. ఈ క్రమంలో హైకోర్టు సింగిల్ బెంచ్ వన్ టూ నోటిఫికేషన్ లను సెట్ ఎసైడ్ చేయాలని 31 అక్టోబర్ 2025 తీర్పునిచ్చిందని తెలిపారు. ఆ తీర్పును సవాలు చేస్తూ యూనివర్సిటీ అధికారులు, నియామకమైన అధ్యాపకులందరూ హైకోర్టు డివిజన్ బెంచ్ ను ఆశ్రయించారని పేర్కొన్నారు. అధ్యాపకులందరూ న్యాయస్థానాలపై పూర్తి విశ్వాసంతో ఉన్నారని చెప్పారు. కోర్టులో పెండింగ్‌లో ఉన్న అంశాలను వక్రీకరించి ఆరోపణలు చేస్తే సంబంధితులపై డిఫమేషన్, కాంటెంప్ట్ ఇతర చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి అసోసియేషన్ వెనుకాడదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉపాధ్యక్షుడు డా. సత్యనారాయణ రెడ్డి, కార్యదర్శి బాలకిషన్, డాక్టర్ నీలిమ, ప్రతినిధులు జమీల్, ప్రసన్న రాణి, విద్యావర్ధిని, డా. వాసం చంద్రశేఖర్, డా . అంజయ్య, నాగరాజు, సబితా, లక్షణ చక్రవర్తి, ప్రసన్న శీల తదితరులు ఉన్నారు.

ఇది కూడా చదవండి..: Gampa Govardhan Criticism | రైతులను పట్టించుకోని ప్రభుత్వం : మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *