Constable Heart Attack | జిమ్‌లో గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

ఉత్తరాఖండ్‌కు చెందిన కానిస్టేబుల్ గిరీష్ భట్ చంపావత్‌లోని ఒక జిమ్‌లో వర్కవుట్ చేస్తూ గుండెపోటుతో మరణించారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Constable Heart Attack | ఉత్తరాఖండ్‌ (Uttarakhand)కు చెందిన కానిస్టేబుల్ గిరీష్ భట్ చంపావత్‌లోని ఒక జిమ్‌లో వర్కవుట్ చేస్తూ గుండెపోటుతో మరణించారు. వ్యాయామం ముగించి కిందకు రాగానే ఆయన ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

దేశంలో ఇటీవల గుండెపోట్లు పెరిగాయి. చాలా మంది హార్ట్​ ఎటాక్​తో మరణిస్తున్నారు. ఇందులో యువత, చిన్న పిల్లలు సైతం ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఇటీవల పోలీస్​ శాఖ సిబ్బందిలో సైతం గుండెపోట్లు పెరిగాయి. తాజాగా ఉత్తరాఖండ్​లో చంపావత్ జిల్లా (Champawat District)కు చెందిన స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG) అధికారి శుక్రవారం జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా హార్ట్​ఎటాక్​తో చనిపోయాడు.

Constable Heart Attack | వ్యాయామం చేస్తుండగా..

మృతుడిని బన్‌బాసా నివాసి, చంపావత్ SOGలో సేవలందిస్తున్న 38 ఏళ్ల గిరీష్ భట్‌గా గుర్తించారు. భట్ స్థానిక జిమ్‌లో వ్యాయామం చేస్తుండగా అకస్మాత్తుగా కుప్పకూలిపోయారు. జిమ్‌లో ఉన్నవారు వెంటనే అతడిని సమీపంలోని ఖతీమాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లు వైద్యులు తెలిపారు. ఆయన భార్యకు ఇద్దరు కుమారులు ఉన్నారు. తెలంగాణలో సైతం ఇటీవల ఇద్దరు కానిస్టేబుళ్లు గుండెపోటుతో మరణించారు. నిజామాబాద్​ జిల్లాలో ఓ హెడ్​ కానిస్టేబుల్ విధుల్లో ఉండగా ప్రాణాలు వదిలాడు. కామారెడ్డి జిల్లా గాంధారిలో ఓ కానిస్టేబుల్ విధులు ముగించుకొని ఇంటికి వెళ్లిన తర్వాత ఛాతిలో నొప్పి వస్తుందని చెప్పి కుప్ప కూలాడు.

ఇది కూడా చదవండి..: Telangana Electric Buses | పీఎం ఈ-డ్రైవ్, ఈ-బస్ సేవ: తెలంగాణకు 2,351 ఎలక్ట్రిక్ బస్సులు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *