Yoga Day | ప్రకృతి ఒడిలో యోగా.. ఆకట్టుకున్న ఏనుగులు

పశ్చిమ బెంగాల్​లోని అలీపుర్‌దువార్​లో యోగా దినోత్సవం సందర్భంగా జల్దాపారా జాతీయ పార్కులో మావటీలు 'కుంకీ' ఏనుగులపై కూర్చుని ఆసనాలు వేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Yoga Day | అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఆదివారం దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల నుంచి అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు యోగా డేలో పాల్గొన్నారు.

ప్రధాని మోదీ (PM Modi), ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం యోగా ఆసనాలు వేశారు. పశ్చిమ బెంగాల్​లోని అలీపుర్‌దువార్​లో అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా, జల్దాపారా జాతీయ పార్కులో మావటీలు ‘కుంకీ’ ఏనుగుల వీపులపై కూర్చుని యోగాసనాలు వేశారు.

Yoga Day | నదీ తీరంలో

Yoga Day

హలోంగ్ నదీ తీరంలో అటవీ శాఖ సిబ్బంది, అధికారులు ఆరు కుంకీ ఏనుగులతో కలిసి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు, ఏనుగులు కలిసి యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్న ఈ దృశ్యాన్ని జల్దాపారా జాతీయ పార్కు అధికారులు సోషల్​ మీడియాలో పోస్ట్ చేశారు. పచ్చని ప్రకృతి అందాల నడుమ, నది తీరాన ఏనుగులతో కలిసి యోగా చేస్తున్న వీడియో వైరల్​ అవుతోంది.

ఇది కూడా చదవండి..: Indigenous Warships Commissioned | అభివృద్ధి, భద్రత సముద్రంతో ముడిపడి ఉన్నాయి : ప్రధాని మోదీ

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *